మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు భారీ షాక్

మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు భారీ షాక్
x
Highlights

మొన్న జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. బుధవారం వెల్లడైన మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్‌...

మొన్న జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. బుధవారం వెల్లడైన మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోగా.. ట్రంప్ సారధ్యంలోని రిపబ్లిక్‌ పార్టీ సెనేట్‌ ఆధిక్యం సాధించింది. ప్రతినిధుల సభలోని 435 స్థానాల్లో ఎన్నికలు జరగగా 419 చోట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో 223 స్థానాల్లో డెమోక్రటిక్‌ పార్టీ గెలుపొందగా, 196 స్థానాల్లో రిపబ్లికన్లు విజయం సాధించారు. కాగా రిపబ్లికన్లు గెలిచిన 28 సిట్టింగ్ స్థానాలను సైతం డెమోక్రాట్లు గెలుచుకున్నారు. దాంతో హౌస్ లో మెజారిటీ సాధించారు.

ఇదిలావుంటే సెనేట్‌లో మాత్రం రిపబ్లికన్‌ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. 100 స్థానాలున్న సెనేట్‌లో 35 సీట్లకు పోలింగ్‌ జరగగా.. 32 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్లు 51 మంది, డెమోక్రాట్లు 46 మంది అయ్యారు. ఇందులో డెమోక్రాట్లు రెండు సిట్టింగ్ సీట్లను కోల్పోయారు. ఇంకా మూడు స్థానాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఇక 36 రాష్ట్రాల గవర్నర్‌ పదవులకు ఎన్నికలు జరగగా ఇప్పటికి 33 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. గతంలో ఉన్న గవర్నర్ ల సంఖ్య కంటే డెమోక్రటిక్‌ పార్టీ ఏడుగురు పెరిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories