యువతిపై పోలీసు అధికారి కుమారుడి అరాచకం

Submitted by arun on Fri, 09/14/2018 - 17:09
Delhi Cop’s Son

ఓ పోలీసు అధికారి కుమారుడు తన కావరాన్ని చూపించాడు. ఓ అమ్మాయిపై తన ప్రతాపాన్ని ప్రదర్శించాడు. ఢిల్లీలో ఎస్సైగా పనిచేస్తున్న అశోక్‌కుమార్‌ కుమారుడు రోహిత్‌ ఓ అమ్మాయిని చితకబాదాడు. మధ్యం సేవించిన రోహిత్‌ బూతులు తిడుతూ కాళ్లతో, చేతులతో ఇష్టమొచ్చినట్లు బాదేశాడు. అమ్మాయి వేడుకుంటున్నా పట్టించుకోకుండా వీడియో తీస్తున్న తన ఫ్రెండ్‌ వద్దన్నా వినకుండా కాళ్లతో ముఖంపై దాడి చేశాడు. ఓ కాల్‌సెంటర్‌లో జరిగిన ఈ వ్యవహారం అంతా సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ అయ్యింది. 

అయితే ఇక్కడ మరో ట్విస్ట్‌ ఏంటంటే ఈ వీడియో రోహిత్‌ తన మాజీ లవర్‌ జ్యోతీశర్మకు పంపాడు. నీకూ ఇదే గతి పడుతుందంటూ జ్యోతికి ఈ వీడియో సెండ్‌ చేశాడు. యేడాదిన్నర పాటు రోహిత్‌తో డేటింగ్‌ చేసిన జ్యోతిశర్మ అతని వ్యక్తిగతంగా అతను నచ్చకపోవడంతో విడిగా ఉంటుంది. తనని పెళ్లి చేసుకోవాలని లేకుంటే నీకూ ఇలాంటి ట్రీట్‌మెంట్‌ ఉంటుందని హెచ్చరించాడు. దీంతో భయపడ్డ జ్యోతి రోహిత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటు పోలీసులు రోహిత్‌పై 354, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే తాను స్టేషన్‌కు వెళ్లినప్పుడు లాకప్‌లో రోహిత్‌ లేడని అతన్ని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని జ్యోతి ఆరోపిస్తోంది. 

English Title
Delhi Cop’s Son Brutally Assaults Woman

MORE FROM AUTHOR

RELATED ARTICLES