డిసెంబరు 21. వెరీ డేంజరస్‌ డే

Submitted by arun on Thu, 12/21/2017 - 11:23
Dec. 21 will be the worst day of 2017

డిసెంబరు 21. టోటల్‌ ఇయర్‌లోనే చాలా డేంజరస్‌ డేనట. ఆ రోజు ఏం చేసినా మటాషే అంటూ మతాబులు పేలుస్తున్నారు. దీని ఎఫెక్ట్‌ ఆ ఒక్కరోజుకే కాకుండా ఈ నెల ఇంకా చెప్పాలంటే వచ్చే ఏడాదంతా వెంటాడుతోందన్న ప్రచారం కోడై కూస్తోంది. ఏంటీ? డిసెంబరు 21. బీకేర్‌ఫుల్‌ తస్మాత్‌ జాగ్రత్త అంటున్న సంకేతాలు ఎందుకొస్తున్నాయ్‌.? ఇంతకీ అసలు నిజమేంటి? నేడు ఏం జరగబోతోంది?

 డిసెంబరు 21. వెరీ డేంజరస్‌ డే..డిసెంబరు 21. మోస్ట్‌ డేంజరస్‌ డే.. ఒక్క డిసెంబరు 21కి ఇన్ని డేంజరస్‌లు ఏంటని పరేషాన్‌ అవుతున్నారా? డెఫినెంట్‌గా డేంజరే అన్న ప్రచారంలో వాస్తవముందా?

 ఏదో కాస్త ఒడిదుడుకులు ఉన్నా ఒత్తిళ్లు ఉన్నా బాధలు, కష్టాలు, కన్నీళ్లు, సుఖాలు అన్నింటిని మిక్స్‌ చేసి ఫుల్‌స్టాప్‌తో ఫిక్స్‌ చేసిన 2017 పోతూ పోతూ డిసెంబరు 21 పేరిట ఓ భయంకరమైన రోజును మనపై రుద్ది పోతుందన్న అపవాదును మూటగట్టుకోబోతోందా?

డిసెంబరు 21న ఏ పని మొదలు పెట్టినా మాటాషేనని, ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా దురదృష్టం వెంటాడుతుందని, దీని ప్రభావం 21నాడే కాకుండా రాబోయే ఏడాది 2018పైనా ప్రభావం చూపిస్తుందన్న ప్రచారం వైరల్‌ అవుతోంది. అవును. ఇది నిజమేనని చెబుతున్నారు పాశ్చాత్య జ్యోతిష్కులు. 

వాస్తవానికి డిసెంబరు 21. షార్టెస్ట్‌ డేగా పిలుచుకుంటాం. మిగిలిన రోజులతో పోలిస్తే డిసెంబరు 21 ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది మనకి. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ 350 ఏళ్లలో తొలిసారి సూర్యుడు, శని ఒకే రాశిలోకి రావడం ప్రళయ సంకేతమని నీల్‌ స్పెన్సర్‌ అనే పాశ్చాత్యా జ్యోతిషుడు లీకిచ్చాడు. అంతే విషయం ఒక్కసారిగా వైరల్‌ అయింది. రియల్‌ ఏంటో కనుక్కోలేనంత కన్ఫ్యూజన్‌లోకి తీసుకెళ్లింది.

కీస్తు శకం 1664 తర్వాత అలాంటి ఖగోళ మార్పు డిసెంబరు 21న సంభవించనుందన్నది పాశ్చాత్యజ్యోతిషుల హెచ్చరిక. ఖగోళపరంగా ఇది ప్రమాదకరమైన విషయమే కాదు ప్రళయ కారకం కూడా అని వార్నింగ్‌ ఇస్తున్నారు. అందుకే డిసెంబరు 21 గురువారం ఏ కొత్త నిర్ణయాలు తీసుకోవద్దనీ ఆస్ట్రాలజీ వెబ్‌సైట్లు కూడా సూచిస్తున్నాయి.

English Title
Dec. 21 will be the worst day of 2017

MORE FROM AUTHOR

RELATED ARTICLES