బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికెట్ జారీ!

x
Highlights

ఓ ప్రభుత్వ ఉద్యోగి తలరాతను తమ చేతిరాతతో మార్చేశారు అక్కడి అధికారులు. బతికున్న వ్యక్తి చనిపోయినట్టు డెత్‌ సర్టిఫికెట్‌ జారీ చేశారు. దీంతో ఖంగుతిన్న...

ఓ ప్రభుత్వ ఉద్యోగి తలరాతను తమ చేతిరాతతో మార్చేశారు అక్కడి అధికారులు. బతికున్న వ్యక్తి చనిపోయినట్టు డెత్‌ సర్టిఫికెట్‌ జారీ చేశారు. దీంతో ఖంగుతిన్న బాధితుడు నేను బ్రతికున్నానంటూ లబోదిబోమంటున్నాడు. కరీంనగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానిక అధికారుల పనితీరుపై అద్దం పడుతుంది.

కరీంనగర్‌ నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట నేను బ్రతికే ఉన్నానంటూ ఆందోళన చేస్తున్న ఈ వ్యక్తి పేరు మహ్మద్ జమాలోద్దీన్. అంధుడైన జమాలుద్దీన్ కరీంనగర్ ఆయూశ్ విభాగంలో నాల్గో తరగతి ఉద్యోగిగా పనిచేస్తూ, జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతను చనిపోయినట్టు కరీంనగర్ మున్సిపల్‌ కార్పోరేషన్ అధికారులు డెత్‌ సర్టిఫికెట్‌ జారీ చేసేశారు.

జమాలుద్దీన్ నేటికీ ఆయుష్ విభాగంలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా జమాలుద్దీన్ కుటుంబసభ్యుల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతుండడంతో వివాదం కాస్తా న్యాయస్థానం పరిధిలోకి వెళ్లింది. ఎలాగైనా భూమిని కాజేయాలనుకున్న బాధితుడి అన్న, ఇతర కుటుంబసభ్యులు అక్రమ మార్గంలో నగర పాలక సంస్థ నుంచి జమాలుద్దీన్ చనిపోయినట్లు ధృవీకరణ సర్టిఫికెట్ దరాఖాస్తు చేసుకున్నారు. అధికారులు గతేడాది నవంబర్ 3న జమాలుద్దీన్ చనిపోయినట్లు ధృవీకరిస్తూ సర్టిఫికెట్ జారీ చేశారు.

తాను చనిపోయినట్టు జారీ చేసిన డెత్‌ సర్టిఫికెట్‌ను కోర్టుకు అందించాడు బాధితుడు. తాను బ్రతికే ఉన్నట్టు ధృవీకరణ పత్రం జారీ చేయాలంటూ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. మరణ ధృవీకరణ పత్రాలను జారీ చేసే సమయంలో అధికారులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నాడు. మనిషి చనిపోయాడా లేదా బతికి ఉన్నాడా అని విచారించకుండానే అధికారులు గుడ్డిగా సంతకాలు చేయడం మాత్రం ప్రస్తుతం వివాదాస్సదంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories