డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లలో నాణ్యతా లోపం...చిన్నపాటి వర్షానికే...

x
Highlights

నిరుపేదలకు నీడ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్‌రూం పథకం అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది నిర్మాణాలలో గుత్తేదారులు నాణ్యతను గాలికి...

నిరుపేదలకు నీడ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్‌రూం పథకం అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది నిర్మాణాలలో గుత్తేదారులు నాణ్యతను గాలికి వదిలేస్తున్నారు చిన్న వర్షానికే డబుల్ బెడ్‌రూం ఇళ్లు నీళ్లు చిమ్ముతుండటంతో లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మాణాన్ని చేపడుతోంది అందుకు అనుగుణంగా ఏటేటా నిధులనూ కేటాయిస్తోంది. అయితే నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రభుత్వం పేదలకు లక్షలు ఖర్చుచేసి డబుల్ బెడ్‌రూం ఇళ్ళ నిర్మించి ఇవ్వాలని చెబితే కాంట్రాక్టర్లు, అధికారులు కాసుల కక్కుర్తితో నాసిరకంగా ఇళ్లు నిర్మిస్తున్నారంటున్నారు జిల్లాలోని పాలేరు, సత్తుపల్లి నియోజక వర్గాల్లో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా ఇళ్ల నిర్మించారని ఆరోపిస్తున్నారు.

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లాలోని జుజ్జులరావు పేట, కారేపల్లి, కల్లూరు, ఖమ్మం రూరల్ మండలాల్లోని డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధి దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వర్షానికి ఇళ్లంతా పూర్తిగా చెమ్మతేలి గోడలు నిమ్ముతేల్తున్నాయి. ఇళ్ళ నిర్మాణానికి ఉపయోగించే సిమెంటు, ఇసుక లోపభూయిష్టంగా, నాసిరకంగా ఉన్నాయని, తక్కువ ధరలకు వచ్చే సిమెంటును, ఏటిలో దొరికే ఇసుకను ఇండ్ల నిర్మాణానికి వాడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

మరికొన్ని చోట్ల తలుపులు, కిటికీలు పెట్టిన తర్వాత ఏర్పడే గ్యాప్‌లను సరిగ్గా పూడ్చలేదు ఇక వాటర్ లైన్లను, సింక్, శానిటరీ పైపులు సరిగ్గా ఫిట్ చేయకపోవడంతో లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గోడలు చెమ్మగిల్లి ఇళ్లలోకి నీళ్లు వస్తుండటంతో.. షార్ట్ సర్కూట్ అవుతోంది దీంతో ఫ్యాన్లు, లైట్లు పాడవుతున్నాయి. ఒక్కోసారి షాక్ కొడుతోందని ప్రజలు వాపోతున్నారు. మొత్తానికి ఖర్చు ఎక్కువ అవుతుండటంతో డబల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు.. నాసిరకం ఇటుకలు, కల్తీ సిమెంట్‌తో నిర్మిస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories