డబ్బులు తీసుకున్నట్లు జగ్గారెడ్డి ఒప్పుకున్నారు: డీసీపీ సుమతి

x
Highlights

జగ్గారెడ్డి తప్పుడు ధృవపత్రాలతో పాస్‌పోర్టుకు దరఖాస్తు చేశారని నార్త్‌జోన్‌ డీసీపీ సుమతి తెలిపారు. కుటుంబ సభ్యుల పేరుతో వేరే వ్యక్తులను విదేశాలకు...

జగ్గారెడ్డి తప్పుడు ధృవపత్రాలతో పాస్‌పోర్టుకు దరఖాస్తు చేశారని నార్త్‌జోన్‌ డీసీపీ సుమతి తెలిపారు. కుటుంబ సభ్యుల పేరుతో వేరే వ్యక్తులను విదేశాలకు పంపారని చెప్పారు. ఫేక్‌ డాక్యుమెంట్స్‌, ఫేక్‌ పాస్‌పోర్టుతో వీసాకు ధరఖాస్తు చేశారని సుమతి తెలిపారు. నాలుగేళ్ల కూతురును 17ఏళ్లుగా, నాలుగేళ్ల కొడుకును 15ఏళ్లుగా చూపించారని.. ఆధార్‌ డేటా చూస్తే నిజానిజాలు బయటపడ్డాయన్నారు. వెళ్లిన ముగ్గురు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు కాదని తెలుస్తోందని చెప్పారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇతర వ్యక్తులను తన కుటుంబ సభ్యులగా పేర్కొంటూ లెటర్‌హాడ్‌పై పాస్‌పోర్టు కోసం రిక్వెస్ట్‌ చేశారని నార్త్‌జోన్‌ డీసీపీ సుమతి తెలిపారు.

సికింద్రాబాద్‌ మార్కెట్‌ పీఎస్‌కు వచ్చిన ఫిర్యాదుతో నిశితంగా దర్యాప్తు చేశామన్నారు. 2004లో ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల పేర్లతో అక్రమంగా పాస్‌పోర్ట్‌లు పొందారని, ఎమ్మెల్యే లెటర్‌ హెడ్‌తో పాస్‌పోర్టులు ఇవ్వాలని కోరారన్నారు. ఈ నకిలీ పాస్‌పోర్ట్‌లతో వీసాలు పొందారని, భార్య ఫొటో, కుమార్తె, కుమారుడు పుట్టిన తేదీల మార్పిడి జరిగిందన్నారు. ఆధార్‌ డేటా ఆధారంగా ఈ అక్రమాలను గుర్తించినట్లు స్పష్టం చేశారు. జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అమెరికాకు పంపించిన నకిలీ వ్యక్తులను బ్రోకర్‌ మధు తన దగ్గరకు తీసుకొచ్చాడని ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు తీసుకున్నట్లు తమ విచారణలో జగ్గారెడ్డి చెప్పారన్నారు. ఐపీసీ 419,490,467,468,471,370 సెక్షన్లతో పాస్‌పోర్ట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 12, ఇమ్మిగ్రేషన్ యాక్ట్‌ 24 కింద కేసులు నమోదు చేశామన్నారు, ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories