ద‌స‌రాను స‌రదాగా గ‌డ‌ప‌డానికి ఈ ప్ర‌దేశాల‌కు వెళ్లండి

ద‌స‌రాను స‌రదాగా గ‌డ‌ప‌డానికి ఈ ప్ర‌దేశాల‌కు వెళ్లండి
x
Highlights

ఈనెలలో దసరా సెలవులను ఎలా గడపాలనుకుంటున్నారు. ఇంకెలా ఇంట్లో హాయిగా పండుగ చేసేసుకుంటాం. మహా అయితే ఊరికి కూడా వెళ్తాం అని అంటారేమో. ప్రతిఏటా ఇంట్లోనే కదా...

ఈనెలలో దసరా సెలవులను ఎలా గడపాలనుకుంటున్నారు. ఇంకెలా ఇంట్లో హాయిగా పండుగ చేసేసుకుంటాం. మహా అయితే ఊరికి కూడా వెళ్తాం అని అంటారేమో. ప్రతిఏటా ఇంట్లోనే కదా మనం అన్ని పండుగలను జరుపుకునేది. ఈసారి వెరైటీగా ‘దసరా డెస్టినేషన్ వెకేషన్ ప్లాన్ చేసుకోగలరేమో ప్రయుత్నించి చూడండి. ఎందుకంటే ఇన్ని రోజుల సెలవులను ఎక్కడికైనా అంటే దసరాను విభిన్నంగా జరుపుకునే ప్రదేశాలను చుట్టిరండి. మరి దసరా వెకేషన్స్‌కోసం ఏయే ప్రదేశాలు రౌండ్ వేసుకురావచ్చో అని ఆలోచిస్తుంటే..ఇదిగో ఈరోజు కుటుంబం మీలాంటి వారికి ఇస్తున్న ఈ ట్రావెల్ డెస్టినేషన్స్‌ను ఓమారు లుక్కేయండి..

బస్తర్ దసరా రెండున్నర నెలలు !
ట్రైబల్స్ తమ సంప్రదాయ విధానంలో దసరాను జరుపుకోవడం బస్తర్ దసరా స్పెషాలిటీ. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో 75 రోజులపాటు ఇది సాగుతుంది. దసరా జరిపేది 10 రోజులేగా అనుకోకండి, ఛత్తీస్‌గఢ్‌లోమాత్రం రెండున్నర నెలలపాటు దసరా జరుపుకోవడం స్థానిక ఆచారం. గిరిజనుల నిజజీవితాల్లోకి తొంగిచూసే అరుదైన అవకాశం కోసం వేచిచూస్తున్నవారికి ఇదే సరైన సమయం. బస్తర్ లేదా జగదల్‌పూర్ అనే ఈ వేదికపై 13వ శతాబ్దంనుంచి దసరా సంబరాలు ప్రారంభైవెునట్టు చరిత్ర చెబుతోంది. మన కాకతీయ రాజులు ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. కానీ రామాయణ ఘట్టాలుమాత్రం ఇక్కడ ప్రదర్శించకపోవడం విశేషం. మీరు దసరాలో ఇక్కడ గడిపితేచాలు. జీవితకాలపు మధురస్మృతులను పదిలంగా మోసుకుని వెళ్లవచ్చు. రథోత్సవంతో పాటు ట్రైబల్స్ సంస్కృతిని ప్రతిబింభించేలా ఈ తంతు సాగుతుంది.

చండీగఢ్ సౌదర్యం ఇనువుడించేలా...
ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ మానసపుత్రిక చండీగఢ్‌లోని బరారాలో రావణుడి 200 అడుగుల భారీ విగ్రహాన్ని తగులబెడతారు. ఇక మ్యూజిక్, డ్యాన్స్ అయితే ఇక్కడికివచ్చినవారందరినీ ఊపేస్తాయి. చండీగఢ్ అద్భుతైమెన నగరంగా చూపరులను ఆకట్టుకుంటుంది. మీరు ట్రావెల్ ఫ్రీక్ అయితే..ఇక ఇక్కడి లైఫ్ స్టైల్ మీకు పిచ్చిగా నచ్చితీరుతుందంటే అతిశయోక్తి కాదు. రాక్ గార్డెన్స్, చండీగడ్ సిటీ, సమీపంలోని అమృత్‌సర్ దేవాలయం ఇలా ఒకటేమిటి.. మీరు పంజాబీ రుచులతోపాటు కాసింత వీలు చేసుకోగలిగితే వాఘా బోర్డర్‌లో మన సరిహద్దు రేఖను (ఎల్‌ఓసీని) కూడా చూసిరావచ్చు. దసరాలో చండీగఢ్‌కు ఉత్తరాదివాసులు చాలామందే వస్తారు. పంజాబ్ రాష్ట్రంలో 9 రోజులపాటు రాత్రిళ్లు జాగారం చేసి పూజలు చేస్తారు. మీరు చండీగఢ్‌కు వెళ్తే పదిరోజుల సెలవులు ఎప్పుడు గడిచిపోయాయో అనేలా సమయం పరిగెత్తుతుంది.

మడికెరి (కూర్గ్) అందం ఈరోజుల్లోనే చూడాలి..
‘మంచి కాఫీలాంటి ట్రిప్ అంటే కూర్గ్ ట్రిప్ అనే చెప్పుకోవాలి. కొడనాడు జీవన శైలి ఎంత విభిన్నంగా ఉంటుందో.. ఇక్కడి పర్యాటకప్రాంతాలు అంతే ఆహ్లాదాన్ని పంచుతాయి. దసరాలో ఇక్కడ జరిపే అత్యంత పురాతన సంప్రదాయ కార్యక్రమాలు అదుర్స్. అందుకే వైుసూరులో దసరా సంబరాలు చూడలేకపోతే మడికెరెకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. కావేరీ జన్మస్థానం తలకావేరీ అందాలు, వాటర్ ఫాల్స్, సమీపంలోని అత్యంత పురాతనైమెన ఆలయాలు, మరోైవెపు దసరా పండుగ సంబురాలు.. ఇక ఏం కావాలి ఈ జీవితానికి అనేలా 10 రోజులపాటు కరగ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు మడికెరె వెళ్తే మంచి హిల్‌స్టేషన్స్‌లో రీఛార్జ్ అయి రావచ్చుకూడా. అంటే స్వామి కార్యం స్వకార్యం రెండూ అవుతాయి.

ఉత్తరాదిలో.. వర్ణించలేం.. చూడాల్సిందే..
ఉత్తరాదిలో గ్రామగ్రామాన మేళాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా సాగుతాయి. సెప్టెంబరు 21నుంచి ప్రారంభంకానున్న నవరాత్రులను చూడాలంటే మీరు ‘దసరా డెస్టినేషన్ ’ వెకేషన్లో ఎక్కడికెళ్లాలో ప్లాన్ చేసుకోవాడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఓసారి అలా వె ళ్లొస్తే మీలోకూడా సరికొత్త ఉత్సాహం తొంగి చూస్తుంది. ఎప్పుడూ టీవీలు, వెబ్‌ైసెట్లు, సినిమాల్లోనేకాదు.. ఇవన్నీ నిజంగాకూడా చూసివచ్చేందుకు రవాణా సదుపాయాలు మెండుగా ఉన్నందున ఈ సెలవుల్లో మీరు, మీ కుటుంబం మనదేశంలోని విభిన్న సంస్కృతులను రుచి చూసేందుకు దసరా డెస్టినేషన్‌ను ఎంచుకోండి.

సుదూర ప్రాంతాలకు వెళ్లలేకపోతే ?
ఓ పని చేయండి ఇలాంటి దూర ప్రాంతాలకు వెళ్లలేవునుకుంటే ఇంట్లోనే కూర్చోకుండా.. ఈసారి విజయవాడ దుర్గమ్మ శరన్నవరాత్రులు లేదా కడపలోని ప్రొద్దుటూరులో వాసవి కన్యాకాపరవేుశ్వరి శరన్నవరాత్రులోైనెనా చూసేందుకు ప్రయుత్నించండి. మన తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది తెలుగువారికి బెజవాడ, ప్రొద్దుటూరులో ఆర్భాటంగా జరిగే దసరా ఉత్సవాల వైభోగం పూర్తీగా తెలియుకపోవచ్చు. ఇవి కాకుండాపోతే అష్టాదశ శక్తిపీఠాల్లో మీకు నచ్చిన చోటికి వెళ్లండి.. అమ్మవారి దర్శనం చేసుకుని సమీపంలోని ప్రాంతాలన్నింటిన కలియదిరిగి, సెలవులను ఆస్వాదించండి. అప్పుడే మీకు మనదేశంలో పండుగలు ఎలా జరుపుకుంటారో పూర్తీగా అవగాహన వస్తుంది, రొటీన్ లైఫ్‌తో విసిగిపోయిన మీరు రిలాక్స్ అవుతారు. విజ్ఞానం, వినోదం కలగలిసిన యాత్రానుభూతి మీరు సంపాదించుకునే మానసిక ఆస్తి అని భావించండి. టూర్, ట్రావెల్, ట్రెక్కింగ్, అడ్వెంచర్ ఇలా ఏం చెప్పినా..వీటిలో ఆధ్యాత్మికత కలగలసిపోయింది. హిల్‌స్టేషన్ మొదలు నదీతీరాలు, బీచ్‌లు ఎక్కడికెళ్లినా మీకు అక్కడ ఆధ్యాత్మికత అంతర్భాగంగా ఉంటుంది. అందుకే దసరా, సంక్రాంతి, దసరా, కృష్ణాష్టమి, ఉగాది, శ్రీరావునవమి ఇలా ఏ పండుగను తీసుకున్నా.. ఆయా పండుగలను పలు టూరిస్టు డెస్టినేషన్స్‌లో సెలబ్రేట్ చేసుకునేందుకు అనువుగా ఉంటుంది. యాత్ర, పర్యాటకం కలబోతనే మన దేశ సంస్కృతి, సంప్రదాయం.

రాజస్థాన్‌లోని కోటాలో...
మనవారికి కోటా (డోరియో) చీరలు బాగా తెలుసు. ఆ కోటా చీరలు తయారయ్యేది ఇక్కడే. చారిత్రాత్మక కోటాలో పదిరోజుల దసరా నభూతో నభవిష్యతి అన్న స్థాయిలో జరుగుతుంది. రాజస్థానీ సంప్రదాయాలు, షాపింగ్, ఫోక్ మ్యూజిక్, ఫోక్ డ్యాన్స్..ఇలా ఒక్కటేమిటి ఇక్కడ దసరాలో కనపించే ఇంధ్రదనసు వర్ణాలు శోభాయుమానంగా, ఆధ్యాత్మికతను వెదజల్లేలా ఉంటుంది. చివరి రోజున ఇక్కడ 75అడుగుల ఎత్తున్న రావణుడు, మేఘనాథ్, కుంభకర్ణుడి ఆకారలను తగులబెట్టడం చూసి తీరాల్సిన ముచ్చట.

కులు దసరా...
17వ శతాబ్దంనుంచీ సాగుతున్న కులు దసరా ఉత్సవాలు నేటికీ ఏమాత్రం వన్నె తగ్గలేదు. హిమాచలీల వాత్సల్యాన్ని చవిచూస్తూ.. వారి నృత్యం,సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలతో మీరుకూడా సేదతీరవచ్చు. బియాస్ నది ఒడ్డున నిత్యం ఈ కార్యక్రమాలు సాగుతాయి. చుట్టూ కొండలు, పచ్చదనం, మధ్యలో లోయలో జానపద కళారూపాలతో సాగే కులు దసరాకు విదేశీయులు ఎక్కువగా వస్తారు. దసరా రోజుల్లో కులూలోని రావుమందిరానికి భక్తులు పోటెత్తుతారు. సాంస్కృతిక పర్యాటకాన్ని ఇష్టపడేవారికి కులూ దసరా చాలాబాగా నచ్చడం ఖాయం.

దసరా ఉత్సవాలకే తలమానికం వైుసూర్..
లక్ష లైట్లతో విజయు దశమి రోజున వైుసూర్ ప్యాలెస్ అందం వావ్ అనిపిస్తుంది. ఇక్కడ జరిగే జంబూ సవారిని చూసేందుకు రెండు కళ్లు చాలవంటే నమ్మండి. విజయునగర రాజులు మొదలుపెట్టిన దసరా ఉత్సవాలు నేటికీ ఇక్కడ అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వైుసూర్ దసరా ఉత్సవాలకు పెట్టింది పేరు. అందుకే దేశ విదేశాలనుంచి పెద్ద ఎత్తున దసరా రోజుల్లో టూరిస్టులు ఇక్కడికి రెక్కలు కట్టుకుని వాలిపోతారు. 9 రోజులపాటు సాగే విన్యాసాలకేళి 10వ రోజు జంబూ సవారీతో ముగింపుకు చేరుకుంటుంది. ఇక వైుసూర్ రాజమందిరం కాంతులీనుతూ.. కళ్లు జిగేల్‌వునేలా.. మిరుమిట్లుగొలుపుతూ మన మదిలో చెరగని ముద్ర వేసేలా కనిపిస్తుంది. ఇక చాముండేశ్వరి టెంపుల్‌ను దర్శించుకుంటే మీ జన్మ తరించినట్టే. ఇది కూడా శక్తిపీఠమే. ఇక ఈనెల జరగబోయే దసరా ఉత్సవాలు 407వ వార్షికోత్సవాలు కావడం విశేషం. కైట్ ఫెస్టివల్, టార్చ్ లైట్ పెరేడ్, దసరా ఎగ్జిబిషన్‌వంటివి ఇక్కడ హైైలెట్స్. పలు రైళ్లు, విమానాలతో కనెక్ట్ అయిన వైుసూరుకు చేరుకునేందుకు బోలెడు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులున్నాయి.

కోల్‌కతాలో దసరా చూసిరండి..
పశ్చివుబెంగాల్ రాష్ట్రంలో లెక్కకు మించి దుర్గాదేవి మండపాలను భారీ ఎత్తున ఏర్పాటు చేస్తారు. ఇక అమ్మవారికి మనం కనివినీ ఎరుగని రీతిలో భోగ్ (నైవేద్యం)అర్పిస్తారు. బెంగాలీ రుచులు, సంప్రదాయాలు ఆస్వాదించాలంటే ఇదే సరైన సమయం. దుర్గా దేవి విగ్రహాలు, అలంకారాలు వర్ణించనలవికాదు. కోల్‌కత్తాలోని దక్షిణేశ్వర్ కాళి మందిరంను కూడా దర్శించుకుని కలకత్తా కాళీమాతను దసరా రోజుల్లో దర్శించుకునే ఛాన్స్‌ను వదులుకోకండి. ఇక అస్సాంలోకూడా దాదాపు పశ్చివుబెంగాల్‌లో తరహాలోనే దసరాను జరుపుకుంటారు. గౌహతిలోని కామాఖ్యా టెంపుల్‌లో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకైటెన కామాఖ్యాదేవి అమ్మవారికి పూజలు చేసి హ్యాపీగా రావచ్చు. ఇక ఈ ప్రాంతాలకు మనరాష్ట్రంనుంచి నేరుగా బస్సులు, రైళ్లు, విమానాల సదుపాయం కూడా ఉన్నందున చేరుకోవడం చాలా సులభం.

గుజరాతీల గర్బా చూడాల్సిన అద్భుతం..
సాయంత్రం మొదలెతే.. తెల్లవారే వరకూ అంబమాత (అంబా దేవి)కు గుజరాతీలు చేసే అర్చననే గర్బ డ్యాన్స్ అంటారు. దీనికే మరోపేరు దాండియా. గుజరాత్‌లో మారుమూల పల్లెలు మొదలు అత్యాధునిక పట్టణాలవరకూ అన్నిటా 10 రోజులూ జరిగే గర్బ సందడి చూడముచ్చటగా ఉంటుంది. ‘ఆవో గర్బ ఖేలేంగే... అంటూ సాగే జానపద గీతాలకు మనం వైువురచిపోవడం ఖాయం. మహిళలు, పురుషులు అంతా కలసి మన కోలన్నకట్టల తరహాలో చేసే లయుబద్ధైమెన నృత్యమే ఈ దాండియా. ఈ నవరాత్రుల్లో గుజరాత్‌లోని వాడవాడల్లో మీకు సీతాకోక చిలుకల్లా కనిపించే నాట్య బృందాలు మనను ట్రాన్స్‌లోకి తీసుకెళ్తాయి.

నవరాత్రుల్లో ప్రతిరోజూ ఉపవాసం ఉంటూనే సాయంత్రవువ్వగానే వీరు అంగరంగ వైభవంగా చేసే సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో నిష్టగా ఉంటాయి. అహ్మదాబాద్‌తోపాటు వదోదర, కచ్ ఇంకా చాలా ప్రాంతాల్లో కైట్ ఫెస్టివల్‌కూడా జరుగుతుంది. ఇటీవల దసరాకు ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. అంబాదేవికి ఇచ్చే హారతులకోసం జ్యోతులను చేతపట్టుకుని, తలపై బోనాల్లాంటి కుండలను పెట్టుకుని వీరు పూనకం వచ్చిన తరహాలో చేసే దాండియా ఒక్కమాైరెనా స్వయంగా మీ కళ్లతో చూసి రండి.

Show Full Article
Print Article
Next Story
More Stories