డేంజర్‌లో పడిన సుంకేసుల డ్యామ్..

డేంజర్‌లో పడిన సుంకేసుల డ్యామ్..
x
Highlights

ఇటీవల కురిసిన వర్షాలకు సుంకేసుల డ్యాం డేంజర్‌లో పడింది. డ్యామ్ కు మొత్తం 30 గేట్లు ఉండగా.. అందులో దాదాపు 20 గేట్లు రిపేర్లలో ఉన్నాయి. దీంతో ఇటీవల...

ఇటీవల కురిసిన వర్షాలకు సుంకేసుల డ్యాం డేంజర్‌లో పడింది. డ్యామ్ కు మొత్తం 30 గేట్లు ఉండగా.. అందులో దాదాపు 20 గేట్లు రిపేర్లలో ఉన్నాయి. దీంతో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఎగువ నుంచి సుంకేసుల డ్యామ్ కు భారీగా వరద నీరు చేరుకుంది. ఈ క్రమంలో ప్రమాదఘటికలు మోదడంతో అధికారులు గేట్లు ఎత్తేందుకు యత్నించారు. అయితే కొన్ని గేట్లు తుప్పుపట్టి మొరాయించాయి.బలవంతంగా గేట్లు ఎత్తుతుండగానే రోప్ వైర్లు తెగి అక్కడే కుప్పకూలాయి. దీంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. మిగితా గేట్లతో పాటు స్లూయిజుల ద్వారా నీటిని దిగువకు వదిలి ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం డ్యాం నుంచి 8 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్రకు భారీగా వరద వస్తుందని తెలిసినా.. అధికారులు సుంకేసుల డ్యామ్ గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వలెనే ఈ పరిస్థితి దాపురించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories