కాంగ్రెస్ ఈ దుస్ధితికి రావడానికి కారణం ఒక వర్గం వారే

కాంగ్రెస్ ఈ దుస్ధితికి రావడానికి కారణం ఒక వర్గం వారే
x
Highlights

కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్‌ నాయకులు దానం నాగేందర్‌ శనివారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి, టీపీసీసీ చీఫ్‌...

కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్‌ నాయకులు దానం నాగేందర్‌ శనివారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలకు పంపారు. ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి పదవులకు ఆశపడి టీఆర్ఎస్‌లో చేరలేదని దానం నాగేందర్ అన్నారు. పదవులు ఉన్నా లేకపోయినా తన వెంట నడిచిన కార్యకర్తల కోసమే కాంగ్రెస్‌ను వీడనన్నారు. టీఆర్ఎస్‌లో పదవులు వచ్చినా రాకపోయినా ... సైనికుడిలా పనిచేయడమే తన లక్ష్యమన్నారు. కాంగ్రెస్‌లోని నేతల తీరు వల్లే మూడు దశాబ్ధాల అనుబంధం తెంచుకున్నానంటూ దానం ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్ఆర్ లాంటి నాయకత్వం కరువైందన్నారు మాజీ మంత్రి దానం నాగేందర్. పార్టీకి దూరమైన పేద,బడుగు, బలహీన వర్గాలను ఆకట్టుకునేందుకు ఒక్క ప్రయత్నం కూడా జరగలేదన్నారు. 50 శాతానికి పైగా ఉన్న బీసీలను పక్కన బెడితే అధికారం ఎలా సాధ్యమవుతుందని సీనియర్ నేతలు ప్రశ్నించారు. పార్టీ ప్రస్తుత దుస్ధితికి ఓ వర్గం నేతలే కారణమంటూ పరోక్ష విమర్శలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు ఎందుకు వెళ్లిపోతున్నారో తెలుసుకోవాలంటూ పార్టీ అధిష్టానానికి దానం సూచించారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం లేకపోవడం వల్లే డీఎస్‌, కేకే వంటి సీనియర్ నేతలు పార్టీ వీడారన్నారు. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాలకు కూడా పార్టీలో తగిన గౌరవం లభించం లేదంటూ ఆరోపించిన ఆయన .. వీహెచ్ లాంటి నేతలు పార్టీలో నామ్‌కే వాస్తే అన్నట్టు ఉన్నారన్నారు. ఈ విషయాన్ని ఆరునెలల ముందుగానే అధినేత రాహుల్ గాంధీకి తెలియజేసినా ఫలితం దక్కలేదన్నారు దానం నాగేందర్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories