టీఆర్‌ఎస్‌లోకి దానం నాగేందర్?

టీఆర్‌ఎస్‌లోకి దానం నాగేందర్?
x
Highlights

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దిక్కులా ఉన్న దానం నాగేందర్‌...హస్తం పార్టీకి...

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దిక్కులా ఉన్న దానం నాగేందర్‌...హస్తం పార్టీకి గుడ్‌ బై చెప్పారు. రాజీనామా లేఖను పీసీసీ చీఫ్‌కు పంపారు. రాజీనామాపై పునరాలోచించుకోవాలని దానంను... పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి, గ్రేటర్ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పని చేసిన దానం నాగేందర్‌...కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. రాజీనామా లేఖను పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌తో పాటు ఏఐసీసీకి పంపారు. దానం నాగేందర్ రాజీనామాపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ స్పందించారు. దానంను బుజ్జగించేందుకు ఉత్తమ్‌...ఆయన ఇంటికి వెళ్లారు. అయితే దానం ఇంట్లో లేకపోవడంతో....ఫోన్‌లో మాట్లాడారు. రాజీనామాపై మరోసారి ఆలోచించుకోవాలని కోరారు. అసంతృప్తి ఉంటే పార్టీతో చర్చించాలని సూచించారు.

గ్రేటర్‌ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర ఓటమి తర్వాత గ్రేటర్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. నేతలు బుజ్జగించడంతో గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కొనసాగారు. తర్వాత అధిష్టానం దానం నాగేందర్‌ను హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నియమించింది. దీనిపై దానం అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ బాధ్యతలు తీసుకోనని గతంలో మాదిరిగానే గ్రేటర్ బాధ్యతలు కావాలని కోరారు. దానం డిమాండ్‌ను పట్టించుకోని కాంగ్రెస్‌ జీహెచ్ఎంసీ బాధ్యతలను అంజన్‌కుమార్‌ యాదవ్‌కు అప్పగించింది. దీంతో దానం నాగేందర్ మనస్థాపం చెందారు. దీనికి తోడు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని కోరినా అధిష్టానం స్పందించలేదు.

మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర సందర్భంగా రేవంత్‌ రెడ్డి హడావిడి చేశారు. కొత్తగా వచ్చిన రేవంత్‌రెడ్డి బస్సు యాత్రలో యాక్టివ్‌ ఉండటంతో పాటు పార్టీలో ప్రాధాన్యత పెరగడాన్ని దానం జీర్ణించుకోలేకపోయారు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో బహిరంగంగానే దానం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తమ్‌ రెండో విడత బస్సు యాత్రకు వెళ్లకుండా దూరంగా ఉన్నారు.

2004లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో రాత్రికి రాత్రే తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2009లో ఎమ్మెల్యేగా గెలుపొంది...వైఎస్‌ క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. వైఎస్‌ చనిపోయినా తర్వాత కూడా కాంగ్రెస్‌తో తన అనుబంధాన్ని కొనసాగించారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన దానం నాగేందర్‌....రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. దానం టీఆర్ఎస్‌లో చేరే అవకాశమున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories