పొద్దున బీజేపీ.. సాయంత్రం కాంగ్రెస్‌

Submitted by arun on Fri, 10/12/2018 - 09:51
congbjp

మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి రెండు జాతీయ పార్టీలకు ఒకే రోజు షాక్ ఇచ్చారు కేవలం కొన్ని గంటల వ్యవధిలో ట్విస్టులు, ఊహకందని మలుపులతో ఎక్కడి నుంచి బయల్దేరారో అక్కడికే వచ్చి ఆగారు. గురువారం ఉదయం బీజేపీ తీర్ధం పుచ్చుకున్న ఆమె సాయంత్రం మల్లీ యూటర్న్ తీసుకొని హస్తం గూటికి చేరారు.

మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి మళ్లీ కాంగ్రెస్ గూటికే వచ్చేశారు. గురువారం ఉదయం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో పద్మినీరెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు అయితే ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలు, రాజనర్సింహ అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు ఆమెకు వ్యతిరేకంగా స్థానికంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

దీంతో కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకున్న ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కార్యకర్తల మనోభావాలు అర్థం చేసుకుని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నానని క్లారిటీ ఇచ్చారు. బీజేపీలో చేరడం అనేది అనుకోకుండా జరిగిన సంఘటన అని ఆమె చెప్పుకొచ్చారు. కార్యకర్తల నుంచి ఇంత రియాక్షన్ ఉంటుందని తాను అనుకోలేదన్నారు. కార్యకర్తల బాధలు తాను చూడలేకపోతున్నానని అందుకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తిరిగి కాంగ్రెస్‌ గూటికి వస్తున్నట్లు పద్మినీరెడ్డి తెలిపారు. 

ఆమె తిరిగి సొంత గూటికి రావడంతో శాంతించిన కాంగ్రెస్ కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. అయితే తిరిగి సొంత గూటికి వచ్చిన పద్మినీరెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ ఇస్తుందా..? లేదా అన్నది తెలియాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

English Title
Damodar Raja Narasimha Wife Padmini Reddy Takes U Turn

MORE FROM AUTHOR

RELATED ARTICLES