నివురుగప్పిన నిప్పులా దాచేపల్లి, నిందితుడి ఆత్మహత్య?

నివురుగప్పిన నిప్పులా దాచేపల్లి, నిందితుడి ఆత్మహత్య?
x
Highlights

బాలిక అత్యాచార ఘటనతో అట్టుడికిన గుంటూరు జిల్లాలోని దాచేపల్లి ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంది. నిన్నటి నుంచి 144 సెక్షన్ కొనసాగుతోంది. దాచేపల్లి,...

బాలిక అత్యాచార ఘటనతో అట్టుడికిన గుంటూరు జిల్లాలోని దాచేపల్లి ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంది. నిన్నటి నుంచి 144 సెక్షన్ కొనసాగుతోంది. దాచేపల్లి, నడికుడి గ్రామాల్లో పోలీసులు మోహరించారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు కొనసాగుతోంది. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు దాచేపల్లిలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు రామ సుబ్బయ్య కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేసట్టారు. 17 పోలీసు బృందాలు నిందితుడి కోసం వేట కొనసాగిస్తున్నాయి.ఇంటెలిజెన్స్, కౌంటర్‌ ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులతో పాటు ఏఆర్, టాస్క్‌ఫోర్స్‌ను సైతం రంగంలోకి దించారు. నిందితుడి సెల్‌ సిగ్నల్‌ ఆధారంగా దాచేపల్లి పరిసర ప్రాంతాల్లోనే కృష్ణానది వైపు వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు.

అయితే నిందితుడు రామసుబ్బయ్యకు బంధువులు ఫోన్ చేస్తే తాను చనిపోతున్నానంటూ చెప్పాడు. ఆ తర్వాతి నుంచి అతని ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్ అని వస్తోంది. పోలీసులు అతని సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ను ట్రాక్‌ చేయగా... దాచేపల్లి సమీపంలోని తంగెడ గ్రామంలోని సెల్‌టవర్‌ పరిధిని చూపించింది. దీని సమీపంలోనే కృష్ణా నది ఉండటంతో...నదిలో దూకి ఉంటాడా లేదంటే..సెల్‌ఫోన్‌ పడేసి ఎటైనా వెళ్లిపోయాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు కృష్ణానదిలో పడవలు , డ్రోన్ కెమేరాల ద్వారా గాలింపు చేపట్టారు. అటు రామసుబ్బయ్య కృష్ణానది దాటి తెలంగాణవైపు వెళ్లి ఉంటాడని కూడా పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.

అటు రామసుబ్బయ్య మనిషికాదని, మానవ రూపంలో ఉన్న మృగమని దాచేపల్లి వాసులు అంటున్నారు. సుబ్బయ్య వ్యక్తిత్వం, అనుమానించే తత్వాన్ని భరించలేక ఆయన భార్య దాదాపు 20 ఏళ్ల కిందటే అతడిని వదిలి వెళ్లిపోయింది. దీంతో... అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా ఏడాదిలోపే వెళ్లిపోయింది. దీంతో అతను 20 సంవత్సరాలుగా ఒంటరిగా బతుకుతున్నాడు. సుబ్బయ్య రిక్షా బండిపై స్థానికుల మసికట్టు గోతాలు వేసుకొని వేరే చోటికి తరలిస్తుంటాడు. చుట్టుపక్కల వాళ్లతో బాగా కలిసిసోయేవాడు. అక్కడి పిల్లలను రిక్షా బండిపై తీసుకెళ్లి చాక్లెట్లు, బిస్కెట్లు కొనిపించేవాడు. బుధవారం కూడా ఇలాగే తొమ్మిదేళ్ల చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో ఇతర చిన్నారులపైనా రామసుబ్బయ్య గతంలో అకృత్యాలకు పాల్పడ్డాడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇక గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న దాచేపల్లి చిన్నారిని వైసీపీ ఎమ్మెల్యే రోజా పరామర్శించారు. ఆ తర్వాత బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ రోజాతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ప్రభుత్వాసుపత్రి దగ్గర ధర్నా నిర్వహించారు. సీఎం నివాసం ఉన్న జిల్లాలో బాలికపై అఘాయిత్యం జరగడం సిగ్గుచేటన్నారు...రోజా. ఒక్క గుంటూరులోనే ఇటీవల 9 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయన్న రోజా...ఇది ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories