తెలంగాణలోనూ ‘పెథాయ్‌’ ప్రభావం ‌

తెలంగాణలోనూ ‘పెథాయ్‌’ ప్రభావం ‌
x
Highlights

పెథాయ్ తుపాను ప్రభావం హైదరాబాద్‌లో తీవ్రంగా ఉంది. పెథాయ్‌ ఎఫెక్ట్‌తో నాలుగు రోజులుగా ఆకాశం మేఘావృతమై చలిగాలులు వీస్తున్నాయి. గురువారం ఓ రేంజ్‌లో వర్షం...

పెథాయ్ తుపాను ప్రభావం హైదరాబాద్‌లో తీవ్రంగా ఉంది. పెథాయ్‌ ఎఫెక్ట్‌తో నాలుగు రోజులుగా ఆకాశం మేఘావృతమై చలిగాలులు వీస్తున్నాయి. గురువారం ఓ రేంజ్‌లో వర్షం దంచికొట్టగా, శుక్రవారం నుంచి వాతావరణం చల్లచల్లగా మారింది. చలిగాలుల తీవ్రతకు సూర్యుడు కూడా భయపడి మూడ్రోజులుగా బయటికి రాలేదు. చలిగాలుల తీవ్రతకు అవస్థలు పడుతోన్న హైదరాబాదీలు చలి తీవ్రతకు గజగజ వణుకుతున్నారు. హైదరాబాద్‌ వాతావరణం చల్లచల్లగా మారింది. చిరు జల్లులు, చల్ల గాలులతో హైదరాబాద్‌ వాసులు గజగజ వణుకుతున్నారు. ఇళ్ల నుంచి భయటికి రావాలంటేనే భ‍యపడుతున్నారు. రాత్రీపగలనే తేడా లేకుండా... మూడ్రోజులుగా చల్ల గాలులు వీస్తున్నాయి. ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. తెల్లవారుజాము మొదలుకొని ఉదయం పది గంటల వరకు మంచు కమ్మేస్తుండగా, ఆ తర్వాత చలి గాలులు కుమ్మేస్తున్నాయి. అసలే చలికాలం ఆపై పెథాయ్ ప్రభావంతో చలిగాలులకు ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. దాంతో ఉద్యోగులు, విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు దాదాపు తెలంగాణ అంతటా పెథాయ్‌ తుపాను ప్రభావం కనిపిస్తోంది. పెథాయ్‌ ఎఫెక్ట్‌తో ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. అలాగే మిగతా జిల్లాల్లోనూ ఆకాశం మేఘావృతమై చలిగాలులు వీస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories