బ్రేకింగ్‌: తీరాన్ని దాటిన పెథాయ్‌..

బ్రేకింగ్‌: తీరాన్ని దాటిన పెథాయ్‌..
x
Highlights

పెథాయ్ తీవ్ర తుపాను తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన దగ్గర తీరాన్ని దాటింది. తాళ్లరేవు-కాట్రేనికోన మధ్యలో సరిగ్గా మధ్యాహ్నం 12గంటల 15 నిమిషాలకు తీరంపై...

పెథాయ్ తీవ్ర తుపాను తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన దగ్గర తీరాన్ని దాటింది. తాళ్లరేవు-కాట్రేనికోన మధ్యలో సరిగ్గా మధ్యాహ్నం 12గంటల 15 నిమిషాలకు తీరంపై విరుచుకుపడింది. దాంతో తీరం వెంబడి గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రంలో అలలు ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్నాయి. దీని ప్రభావం మరో రెండు గంటలపాటు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

తీరాన్ని తాకిన పెథాయ్ తీవ్ర తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అపార పంట నష్టం జరుగుతోంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దక్షిణ కోస్తా నుంచి ఉత్తరాంధ్ర వరకూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటివరకూ 107 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆరు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మరోవైపు సముద్రంలో చిక్కుకున్న ఆరుగురు జాలర్లు ఇంకా ఒడ్డుకు చేరలేదు. ఈనెల 11న బైరవపాలెం-కొత్తపాలెం మధ్య ఆరుగురు జాలర్లు వేటకు వెళ్లారు. ఆయిల్ అయిపోవడంతో సముద్రం మధ్యలో బోటు ఆగిపోయింది. పెథాయ్ తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో ఒడ్డు చేరడం వారికి కష్టంగా మారింది. సముద్రంలో చిక్కుకున్న వారిలో వాసుపల్లి దానియేలు, మారిపల్లి సత్తిబాబు, పేర్ల కాసులు, కుదిడు కాశీ, వాసుపల్లి ఎర్రయ్య, మెరుగు ఏసేబు ఉన్నారు. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories