వణికిస్తున్న వాయుగుండం...భారీ వర్షాలు పడే ఛాన్స్

x
Highlights

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది ఇవాళ్టి సాయంత్రంలోగా తీవ్ర వాయుగుండంగా...

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది ఇవాళ్టి సాయంత్రంలోగా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. వాయుగుండంతో పాటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని దీని ప్రభావంతో ఒడిశాతో పాటు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతాయని తెలిపారు. రాగల 48 గంటల్లో పూరీ, కళింగపట్నం మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తీర ప్రాంత ప్రజలతో పాటు ముఖ్యంగా జాలర్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

ఇటు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కలెక్టర్‌ ధనుంజయ రెడ్డి అధికారులను అలర్ట్‌ విధించారు. సుమారు 10 సెంటీమీటర్ల మేర వర్షం పడే అవకాశం ఉండటంతో తీర ప్రాంత గ్రామస్తులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా 4 కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి, శ్రీకాకుళం కలెక్టర్‌ ఆఫీస్‌లో కంట్రోల్‌ రూమ్‌ లు ఏర్పాటు చేసినట్లు ధనుంజయ రెడ్డి తెలిపారు. మరోవైపు తెలంగాణలో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా వ్యాప్తంగా రాగల 48 గంటల్లో భారీ వర్షాలకు అవకావం ఉన్నట్లు ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories