సీతా ఫలంతో లాభాలెన్నో తెలిస్తే..అసలు వదలరు

Submitted by admin on Wed, 12/13/2017 - 12:58

తియ్యటి ద్రవపదార్థాలతో నోరూరించే పండు.. చూడగానే తినేయాలి అనిపించే ఫలం.. పేదోడి ఆపిల్‌గా పేరొందిన సీతాఫలం అందరికీ చెప్తే చాలు నోరూరక మానదు.. అయితే ధరలు మాత్రం హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్నాయి.
 వరంగల్ అర్బన్ జిల్లాలో సీతాఫలం పండ్ల అమ్మకం ఉపందుకుంది. సహజ సిద్ధమైన ఈ పండ్లు తినేందుకు ప్రజలు ఎంతో ఇష్టపడుతున్నారు. ఎలాంటి ఎరువు మందులు లేకుండా పండే సీతాఫలాలను తినేందుకు ప్రజలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు.. నగర శివారు ప్రాంతాలు, గ్రామాలకు చెందిన ప్రజలు అడవులు, తోటల నుంచి సేకరించిన మధుర ఫలాలను ఎడ్ల బండ్లలో నగరానికి తీసుకొస్తున్నారు. ప్రధాన కూడళ్లు, రోడ్లు, రైతు బజార్లు, కూరగాయల మార్కెట్ల వద్ద వీటిని అమ్ముతున్నారు. 
 అయితే ఒకపక్క ఎంతో శ్రమ పడి, పొద్దంతా కష్టపడి పండ్లను తెస్తుంటే గిట్టుబాటు అవట్లేదని రైతులు వాపోతున్నారు. దీంతో హోల్ సేల్ మార్కెట్ లో ఒక్కో గంపను 200 నుంచి 400 వరకు అమ్ముతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు వ్యాపారులు మాత్రం దీనిని క్యాష్ చేసుకుంటున్నారు. రైతుల దగ్గర నుంచి హోల్‌సేల్‌గా కొనే వ్యాపారులు.. డజన్ల లెక్కలో విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు..పెద్ద సైజుల్లో  ఉన్న డజను పండ్లు 300 ధర పలుకుతున్నాయంటే వీటికి ఏ మేరకు డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. 
ఇక సీతాఫలం కేవలం రుచికే కాదు, మెరుగైన ఆరోగ్యానికి కావాల్సిన పోషక విలువలు అందులో ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. పండుతో పాటు, గింజలు, ఆకులు, కాండం పువ్వులు అన్నీ ఆరోగ్య ప్రదాయినులే అని అంటున్నారు. ఆకుల రసాన్ని తాగితే జీర్ణశక్తి పెరుగుదల, కాండం నుంచి తీసిన కషాయాన్ని తాగితే డయేరియా లాంటి జబ్బులు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. 
 బరువు పెరగాలనుకునేవారు, హైపర్ థైరాయిడ్‌తో బాధపడుతున్న వారికి సీతాఫలానికి మించిన పండు మరొకటిలేదు. మొత్తానికి ఇన్ని ఔషద గుణాలున్న సీతాఫలం తినేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు. 

English Title
custard-apple-health-benefits

MORE FROM AUTHOR

RELATED ARTICLES