అన్నదాతల్ని ముంచిన అకాలవర్షం

x
Highlights

వాతావరణ మార్పుతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు రైతన్నల ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి రైతులు కష్టపడి పండించిన దాన్యం అకాల వర్షంతో తడిసిముద్ధయ్యింది....

వాతావరణ మార్పుతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు రైతన్నల ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి రైతులు కష్టపడి పండించిన దాన్యం అకాల వర్షంతో తడిసిముద్ధయ్యింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్‌ జిల్లాలో రాత్రి పలు మండలాల్లో కురిసిన భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన దాన్యం తడిసిముద్దయ్యింది. ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతుల పాలిట వర్షం శాపంగా మారింది. అకాల వర్షాలతో తడిసిన తమ దాన్యాన్ని ప్రభుత్వంమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో కురిసిన అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్ద అయ్యింది దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చిందని మురిసిపోయిన రైతన్న ఆశలపై వర్షాలు నీళ్లు జల్లాయి సకాలంలో అధికారులు దాన్యాన్ని కొనుగోలు చేయకపోగా దాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక తడిసిన ధాన్యాన్ని దళారుతులు తక్కువ ధరలకు అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షానికి తడిసిముద్దయిన దాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా వర్షాలు రైతులకు తీరని ఆవేదనను మిగిల్చాయి ఐకెపి, పీఏసీఎస్‌ల ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తరలించారు ఒక్కసారిగా కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది మార్కెట్‌ యార్డుకు దాన్యం తీసుకొచ్చిన రైతుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో వర్షానికి తమ దాన్యం తడిసిపోయిందని రైతులు చెబుతున్నారు వర్షానికి తడిసిముద్దయిన దాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

వర్షాలకు జగిత్యాల‌జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కోరుట్ల, మెట్టుపల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లోని వ్యవసాయ మార్కెట్ , ఐకేపి కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మకానికి తెచ్చిన దాన్యం పూర్తిగా తడిసిపోయింది 15 రోజుల క్రితం అమ్మకానికి దాన్యం తెచ్చినా అధికారుల అలసత్వం కారణంగా కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తడిసిన దాన్యానికి మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కురిసిన వర్షానికి పలు కాలనీల్లో రోడ్లపై నీరు నిలిచింది. ఆసిఫాబాద్ మండలం సింగరావుపేట, బూరుగూడ, మోతుగూడ, అప్పెపల్లి , కొమ్ముగూడ, అప్పెపల్లి, ఈదులవాడ గ్రామాల్లో కోతకు వచ్చిన వరి పంట తడిసింది. పలు మండలాల్లో వరితోపాటు పత్తి తడిసిపోయింది. నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఖానాపూర్, కడెం, పెంబి, సోన్, లక్ష్మణచాంద, దిలావర్‌పూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి, కోటపల్లి, భీమారం, తాండూరు, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, చెన్నూర్, హాజీపూర్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories