క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త..త్వరలో తగ్గనున్న సర్వీస్ ఛార్జీలు

Highlights

సర్వీస్ ఛార్జీలతో అల్లాడుతున్న డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఆర్బీఐ శుభవార్త అందించింది. పెద్దనోట్ల రద్దుతో డిజిటల్ పేమెంట్స్...

సర్వీస్ ఛార్జీలతో అల్లాడుతున్న డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఆర్బీఐ శుభవార్త అందించింది. పెద్దనోట్ల రద్దుతో డిజిటల్ పేమెంట్స్ పెరగడంతో పాటు సర్వీస్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. దీన్ని అరికట్టి సర్వీస్ డెబిట్, క్రెడిట్ కార్డు పై అదనపు ఛార్జీల్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. లావాదేవీలపై జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకుంటున్న ఆర్బీఐ అధికారులు తెలిపారు. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు తెలిపింది. మర్చెంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ తో దీంతో పాటు డెవలప్‌మెంట్‌, రెగ్యులేటరీ పాలసీని కూడా ఆర్‌బీఐ నేడు ప్రకటించింది. ‘డెబిట్‌ కార్డు పేమెంట్స్‌కు ప్రోత్సాహం అందించేందుకు మర్చెంట్‌ డిస్కౌంట్‌ రేట్‌(ఎండీఆర్‌) ఫ్రేమ్‌వర్క్‌ను హేతుబద్ధీకరించేందుకు నిర్ణయం తీసుకున్నాం. డిజిటల్ లావాదేవీల ఆధారంగా ఎండీ ఆర్ రేట్లు ఉంటాయని తెలిపింది. కాగా డెబిట్‌, క్రెడిట్‌ కార్డు సేవలు అందిస్తున్నందుకు గానూ.. మర్చెంట్‌ నుంచి బ్యాంకులు ఎండీఆర్‌ ఛార్జీలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories