కాంగ్రెస్‌పై కామ్రేడ్లు కత్తి కడుతురా?

Submitted by santosh on Mon, 11/05/2018 - 16:22
cpi warnings

సీపీఐ ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్‌ వైఖరితో విసిగిపోయిన సీపీఐ... కోరినన్ని సీట్లు ఇవ్వకపోతే తమ దారి తాము చూసుకుంటామంటూ మరోసారి తెగేసి చెప్పింది. మరోసారి కాంగ్రెస్‌తో చర్చిస్తామంటున్న సీపీఐ.... సానుకూల స్పందన రాకపోతే... ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చింది. కాంగ్రెస్‌కు మరోసారి సీపీఐ అల్టిమేటం ఇచ్చింది. కోరినన్ని సీట్లు ఇవ్వకపోతే తమ దారి తాము చూసుకుంటామంటూ తేల్చిచెప్పింది. సీపీఐకి రెండు మూడు సీట్లంటూ లీకులివ్వడంపై సీపీఐ నేతలు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్‌ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన సీపీఐ.... ఒంటరి పోరుకు సిద్ధమంటూ సంకేతాలు ఇచ్చింది. 

హైదరాబాద్‌లో సమావేశమైన సీపీఐ రాష్ట్ర కార్యవర్గం.... ఎన్నికల వ్యూహం, కూటమి సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించింది. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి హాజరైన ఈ సమావేశంలో... ముఖ్యంగా మహా కూటమి సీట్ల సర్దుబాటుపై చర్చ జరిగింది. హుస్నాబాద్‌, బెల్లంపల్లి, కొత్తగూడెం, వైరా, దేవరకొండ, మునుగోడు, ఆలేరు స్థానాలను కోరుతోన్న సీపీఐ.... కనీసం 5 సీట్లు ఇవ్వకుంటే... కూటమి నుంచి బయటికి రావాలని సీపీఐ భావిస్తోంది. ఒకవేళ కూటమి నుంచి బయటికి వస్తే 24 స్థానాల్లో పోటీకి దిగాలని నిర్ణయానికి వచ్చింది. కనీసం ఐదు సీట్లు ఇస్తేనే కూటమిలో కొనసాగుతామని సీపీఐ నేతలు తెగేసి చెబుతున్నారు. అలాగే బలం లేని స్థానాలను అంటగడితే తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు. చివరిగా మరోసారి కాంగ్రెస్‌తో చర్చిస్తామని, ఒకవేళ సానుకూల స్పందన రాకపోతే... ఒంటరి పోరేనంటున్న సీపీఐ... రేపోమాపో తుది నిర్ణయం ప్రకటిస్తామని చెబుతోంది.
 

English Title
cpi warnings

MORE FROM AUTHOR

RELATED ARTICLES