ఏపీ సెక్రటేరియట్ వద్ద సీపీఐ నారాయణ హల్‌చల్

Submitted by arun on Thu, 01/11/2018 - 14:20
cpi narayana

సీపీఐ అగ్రనేత నారాయణ ఏపీ సెక్రటేరియట్ వద్ద ఎస్పీఎఫ్ సిబ్బందిని పరుగులు పెట్టించారు. వేకువజామునే సైక్లింగ్ చేసుకుంటూ వెలగపూడిలోని సచివాలయానికి వచ్చిన నారాయణ సైకిల్‌తో సహా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సచివాలయం చూద్దామంటూ మరో ఇద్దరు నేతలతో కలిసి వచ్చిన నారాయణ నేరుగా లోపలికి ప్రవేశించడాన్ని  గమనించిన ఎస్పీఎఫ్ సిబ్బంది పరుగుపరుగున అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. ఈ సమయంలో లోపల ఎవరూ ఉండరంటూ నారాయణను బయటకు పంపించేశారు. ఇక చేసేది లేక అసెంబ్లీ బయట ఉన్న లాన్‌లో కాసేపు కూర్చొని నారాయణ వెనుతిరిగారు.
 

English Title
cpi narayana halchal at amaravathi

MORE FROM AUTHOR

RELATED ARTICLES