హసన్‌పర్తిలో దారుణం..

Submitted by arun on Tue, 06/19/2018 - 10:39
Hasanparthy

వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తిలో దారుణం జరిగింది. పట్టణంలో నివాసముంటున్న దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హతమార్చారు.   మృతులను గడ్డం దామోదర్‌, పద్మలుగా గుర్తించిన పోలీసులు .. ఆధారాల కోసం క్లూస్ టీంను రంగంలోకి దింపారు.  దోపీడి దొంగలే ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దోపీడియత్నాన్ని దంపతులు అడ్డుకోవడంతో వారిని దారుణంగా హతమార్చారని భావిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తును ప్రారంభించారు. క్లూస్‌ టీమ్‌లు, డాగ్‌ స్క్వాడ్స్‌ను రంగంలోకి దింపి ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు.
 

English Title
couple brutally murdered hasanparthy

MORE FROM AUTHOR

RELATED ARTICLES