నడిరోడ్డుపైనే శృంగారం జరిపిన జంట

Submitted by arun on Mon, 06/11/2018 - 10:52
sex

ముంబైని గత కొన్ని రోజులు వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇటువంటి సమయంలో ఓ విదేశీయుడు నడిరోడ్డుపై, అది కూడా నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే మెరైన్ డ్రైవ్ రోడ్డు డివైడర్‌పై ప్రపంచంతో తనకు సంబంధం లేదన్నట్టుగా శృంగార కార్యకలాపాల్లో మునిగిపోయాడు. భారత దేశానికే చెందిన యువతితో పబ్లిక్‌గా ముద్దుపెట్టుకుంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. శృంగారం మొదలెట్టేసింది జంట. అందరూ తమనే చూస్తున్నారని, వీడియోలు తీస్తున్నారన్న స్పృహను మరిచి, తమ కేళీవిలాసాలలో తేలిపోయారు. పోలీసులు రావడంతో హడావిడిగా దుస్తులు సరిచేసుకుని, అక్కడి నుంచి ఉడాయించేశారు. వెంబడించిన పోలీసులు యువతిని పట్టుకోగలిగారు. పరారీలో ఉన్న యువకుడిని విదేశీయుడిగా గుర్తించారు. యువకుడు రష్యా నుంచి వచ్చినట్టు గుర్తించి అతడి కోసం లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న యువతి పరస్పర విరుద్ధంగా మాట్లాడుతుండడంతో ఆమె మానసిక స్థితి సరిగా లేనట్టు గుర్తించారు. ఓసారి తాము గోవా నుంచి వచ్చామని, మరోసారి రష్యా అని, జెనీవా అని చెబుతున్నప్పటికీ ఆహార్యాన్ని బట్టి ఆమె భారతీయురాలేనని తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. యువతిని చెంబూరులోని మహిళా సురక్షా కేంద్రానికి తరలించినట్టు తెలిపారు.

English Title
Couple Accused Of Having Sex On Road Divider At Mumbai's Marine Drive

MORE FROM AUTHOR

RELATED ARTICLES