బొటానికల్‌ గార్డెన్‌ దగ్గర మహిళ హత్యకేసులో వీడిన మిస్టరీ

Submitted by arun on Mon, 02/12/2018 - 10:34
cctv

రెండు వారాల క్రితం కొండాపూర్ బొటానికల్‌ గార్డెన్‌ వద్ద గోనె సంచుల్లో లభించిన మహిళ మృతదేహానికి సంబంధించిన కేసును సైబరాబాద్‌ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మృతురాలి భర్త, అత్త, మరిది ఈ ఘాతుకానికి పాల్పడ్డారని  గుర్తించారు. ఆదివారమే సీసీ ఫుటేజీ ఆధారంగా కొన్ని కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు సోమవారం నిందితులను కనుగొన్నారు. కొండాపూర్‌లోని ఒక బార్‌లో పనిచేసే అమర్‌కాంత్‌ ఝా, అతని తల్లి, మృతురాలి భర్త కలిసి ఈ దారుణానికి ఒడిగట్టగా.. అమర్‌ కాంత్‌, అతని తల్లి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పడేశారని పోలీసులు తెలిపారు. నిందితుల తల్లిని అదుపులోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు మృతురాలి భర్త, మరిది అమర్‌కాంత్‌ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అమర్‌కాంత్‌ గత 10 రోజులుగా నగరంలోని లేడని వారు అద్దెకుంటున్న యజమాని  తెలిపారు. గత మూడు నెలలుగా తన ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు చెప్పారు. జనవరి 28న రాత్రి గర్భిణీని హత్య చేసి ఉంటారని, తెల్లవారుజామున శ్రీరాంనగర్‌లో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం స్టోన్‌ కటింగ్‌ యంత్రంతో కాళ్లు, చేతులు, తల కోసి ఉంటారని భావిస్తున్నారు. 

English Title
cops find suspects pregnant womans murder

MORE FROM AUTHOR

RELATED ARTICLES