రాహుల్‌ రాక.. సీబీఐ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..

రాహుల్‌ రాక.. సీబీఐ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..
x
Highlights

సీబీఐలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా సీబీఐ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన...

సీబీఐలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా సీబీఐ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం ఎదుట ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు నిరసన కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నేతలతో కలిసి కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. దయాళ్ సింగ్ కాలేజీ నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్‌ వరకూ కిలోమీటర్ దూరం సాగిన ర్యాలీలో రాహుల్‌తో పాటు పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్లులతో రాహుల్ వెంట నడిచారు.

రాహుల్ రాక నేపథ్యంలో సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారీ ఎత్తున పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించారు. సీబీఐ ప్రధాన కార్యాలయం ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కాంగ్రెస్ శ్రేణులను చెల్లాచెదురు చేయడానికి పోలీసులు వాటర్ కెనన్ లు ఉపయోగించారు.మరోవైపు దేశవ్యాప్తంగా సీబీఐ కార్యాలయాల ఎదుట జరిగిన నిరసనల్లో పార్టీ రాష్ట్ర చీఫ్‌లు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం సీబీఐని నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

Image removed.

Image removed.

Show Full Article
Print Article
Next Story
More Stories