రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం : గెహ్లాట్

Submitted by chandram on Fri, 12/07/2018 - 15:14
ashok

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా చివరి రెండు రాష్ట్రాలైన తెలంగాణ, రాజస్థాన్‌లో శుక్రవారం పోలింగ్‌ జోరుగా కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకోవడానికి సీని ప్రముఖులు, రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ప్రాల్గోంటున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరీ మోగిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ సీనియర్ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్. జోథ్‌పూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మేము బ్రహ్మండమైన విజయం సాధిస్తున్నామని అలాగే వచ్చే లోకసభ ఎన్నికల్లో కూడా మా సత్తా ఎంటో చూపిస్తామని అన్నారు. భారతదేశానికి కాంగ్రెస్ పాలన ఎంతో అవసరమని ఆయన అన్నారు. ప్రధాని మోఢీని మళ్లీ గద్దెనెక్కనియ్యామని పెర్కోన్నారు. గడుస్తున్న ఐదేండ్లో రాష్ట్రం వైపు ప్రధాని కన్నెత్తికూడా చూడలేదని అన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమావ్యక్తం చేశారు.
 

English Title
Congress to win in Rajasthan: Gehlot

MORE FROM AUTHOR

RELATED ARTICLES