ఏపీలో కీలకం కాబోతోన్న కాంగ్రెస్ ఓట్లు!

Submitted by arun on Sat, 03/03/2018 - 07:22
congress

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కీలకం కాబోతోంది. బీజేపీతో టీడీపీ కటీఫ్ చెప్పే పరిస్థితిలో మెల్లమెల్లగా స్పష్టత వస్తుండడంతో.. రాజకీయ సమీకరణాలు ఏపీలో వేగంగా మారుతున్నాయి. టీడీపీ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలఏ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు.. టీడీపీని ఓడించేందుకు.. వైసీపీతో బీజేపీ కూడా జతకట్టే అవకాశం లేకపోలేదు. హోదాపై స్పష్టత ఇస్తే.. బీజేపీతో అడుగులు వేసేందుకు సిద్ధమని గతంలో వైసీపీ అధినేత జగన్ చెప్పిన సందర్భం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

దీంతో.. రాను రాను టీడీపీ ఒంటరి పక్షంగానే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో వైపు అనుకున్న ప్రకారం వైసీపీ, బీజేపీ కూటమి పోటీ చేస్తే.. మధ్యలో కాంగ్రెస్ కీలకంగా మారే అవకాశం ఉంది. అంతగా ఆ పార్టీకి బలం లేకున్నా కూడా.. ఎన్నో కొన్ని ఓట్లు సాధించగలిగే అవకాశం కాంగ్రెస్ కు ఉంటుంది. 2014 ఎన్నికల్లో టీడీపీకి బదలాయింపు అయిన కాంగ్రెస్ ఓట్లలో.. ఇప్పుడు కొన్ని తిరిగి ఆ పార్టీ సొంతం చేసుకునే చాన్స్ కూడా ఉంది.

దీంతో.. ఓట్లు చీలడం ఖాయమన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యలో జనసేన ప్రభావం ఎంత ఉంటుంది.. ఆ పార్టీ ఎవరితో కలిసి నడుస్తుంది అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. వైసీపీతో బీజేపీ నడిస్తే.. కచ్చితంగా జనసేనను టీడీపీ దగ్గరికి తీసుకునే అవకాశం ఉంది. అందుకే.. ఒంటరిగా పోటీ చేసే కాంగ్రెస్ నేతలు.. కనీసం వేల సంఖ్యలో ఓట్లు సంపాదించినా కూడా.. అవే కీలకం అయ్యే అవకాశం లేకపోలేదన్న మాట.. రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈ అంచనాల్లో వాస్తవాలు తేలాలంటే.. ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

English Title
Congress votes to be crucial in AP

MORE FROM AUTHOR

RELATED ARTICLES