టీపీసీసీ తీరుపై కాంగ్రెస్ సీనియర్లు గుస్సా

టీపీసీసీ తీరుపై కాంగ్రెస్ సీనియర్లు గుస్సా
x
Highlights

టీపీసీసీ పని తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వంపై దాడికి అందివచ్చిన అవకాశాలను పార్టీ సరిగా ఉపయోగించుకోవడం లేదని...

టీపీసీసీ పని తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వంపై దాడికి అందివచ్చిన అవకాశాలను పార్టీ సరిగా ఉపయోగించుకోవడం లేదని మండిపడుతున్నారు. అంశాలపై సీరియస్‌గా పోరాడాల్సిన సమయంలో బస్సు యాత్రలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే పార్టీ సీనియర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీసీసీ పని తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రభుత్వం తప్పిదాలు చేసి అవకాశాలను అందిస్తుంటే సరిగా ఉపయోగించుకోవడం లేదని భావిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దుచేసి, మిగతా ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేస్తే కేవలం రెండు రోజులు హడావుడి చేసి సైలెంట్ అయిపోవడాన్ని నిలదీస్తున్నారు. సభ్యత్వాల రద్దుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాలతో సర్కార్‌ని ఎండగట్టడంలో పార్టీ విఫలమైందని.. బడ్జెట్, కాగ్ రిపోర్ట్, ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు, పంచాయితీరాజ్ బిల్లులపై నోరు మెదపకపోవడంపై నేతలు మండి పడుతున్నారు.

అందివచ్చిన అవకాశాలను గాలికి వదిలేసి పీసీసీ సొంత ఎజండాతో ముందుకు వెళ్తోందనీ.. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే వాటిని లైట్ తీసుకొని బస్ యాత్ర చేయడం సరికాదని అంటున్నారు. జిల్లాల్లో గ్రూప్ విభేదాలపై కూడా పీసీసీ దృష్టి సారించాలని..నేతలను పిలిచి మాట్లాడి సర్దుబాటు చేయాలని చెబుతున్నారు. వీలైనంత త్వరగా పార్టీ సీనియర్ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్త్ కార్యాచరణ రూపొందించుకోవాలని సూచిస్తున్నారు. ఇకనైనా పీసీసీ తీరు మారకపోతే హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తామని పార్టీ సీనియర్లు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories