కంటతడి పెట్టిన వీహెచ్‌

Submitted by arun on Fri, 04/13/2018 - 16:37
vh

సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వి హనుమంతరావు కంటతడి పెట్టుకున్నారు. తనపై అసత్య వార్తలు రాస్తున్నారంటూ వాపోయారు. శుక్రవారం మీడియాతో మట్లాడిన ఆయన...తన వెనక ప్రజలు లేరని అనడం కేవలం అసత్య ప్రచారమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత హన్మంతరావు. తనకు జాతీయస్థాయిలో పలుకుబడి ఉందన్నారు. వరంగల్ లో నిర్వహించిన సభను చూసి సోనియానే మెచ్చుకున్నారని తెలిపారు. ప్రసుత్తం ఒక లీడర్ ఎదుగుతుంటే, అతన్ని తొక్కేస్తున్నారని.. తాను మాత్రం చాలామంది నేతలకు పదవులిచ్చి ప్రోత్సహిచ్చానని వీహెచ్ చెప్పారు. అయితే, తన ప్రోత్సహంతో ఎదిగిన నేతలే.. తనను మోసం చేశారని వీహెచ్ తెలిపారు. గ్రేటర్‌ నేతలు ఏడుగురిని విమర్శిస్తు కరపత్రాలు ప్రచురిస్తే.. దానిపై న్యూస్‌ పేపర్లలో వార్తలు రాయడం అనైతికం అంటూ వ్యాఖ్యానించారు. సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకొని తనపై అసత్య వార్తలు రాస్తున్నారంటూ కంటతడి పెట్టుకున్నారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశానని, తనపై వార్తలు రాసేముందు ఒకసారి నిజమేంటో తెలసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.

English Title
congress senior leader v hanumantha rao get emotional fake news

MORE FROM AUTHOR

RELATED ARTICLES