బీజేపీ ఘోర పరాజయం!

Submitted by arun on Thu, 02/01/2018 - 18:10
congress

రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్ లో మూడు స్థానాలకు జరిగిన ఉపఎన్నికలో కమలం వాడిపోగా, కాంగ్రెస్ అన్ని స్థానాల్లో గెలిచి తన సత్తా చాటుకుంది. మందల్ గఢ్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు, అజ్మీర్, అల్మార్ పార్లమెంటరీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ ఘోర పరాజయం పాలైంది. ఈ మూడు స్థానాల్లో కాంగ్రెస్ జయభేరి ఎగురవేసింది. ఇక బెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. నవోపార, ఉల్లుబెరియా అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఘోర వైఫల్యాన్ని ఎదురుచూడాల్సి వచ్చింది. అధికారంలో ఉండి కూడా రాజస్థాన్‌లో ఓటమి చవిచూసిన బీజేపీ, బెంగాల్‌లో కొంత మెరుగైంది. రెండు నియోజవర్గాల ఉప ఎన్నికల్లో వామపక్ష పార్టీలను వెనక్కి నెట్టి రెండవ స్థానంలో నిలిచింది.

English Title
Congress Scores 3/3 In Rajasthan Bypolls

MORE FROM AUTHOR

RELATED ARTICLES