నీ కూతుర్ని రేప్ చేస్తా.. ఒక్కసారి పంపిస్తావా..: కాంగ్రెస్ నేత ప్రియాంకకు బెదిరింపులు

Submitted by arun on Mon, 07/02/2018 - 18:05
Priyanka Chaturvedi

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేదికి ట్విట్టర్ వేదికగా బెదిరింపులు వచ్చాయి. ప్రియాంక చతుర్వేది కూతురును రేప్ చేస్తామని గిరీష్‌కే1605 అనే హ్యాండిల్ నుండి ట్వీట్ వచ్చింది. ఈ విషయమై ప్రియాంక చతుర్వేది ముంబై పోలీసులకు  ఫిర్యాదు చేసింది. అయితే ఈ ట్వీట్‌ను సంబంధించిన వివరాలను ఆమె ముంబై పోలీసులకు అందించారు.ఈ విషయమై  తగు చర్యలు తీసుకొంటామని పోలీసులు  హమీ ఇచ్చారు.ఈ ట్వీట్ చేసిన వ్యక్తి ట్విట్టర్లో రాముడి ఫోటోతో పాటు జై శ్రీరామ్ అనే నినాదాలు రాసి ఉన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. గిరీష్‌కేకు ప్రియాంక చతుర్వేదీ ఘాటుగానే రిప్లై ఇచ్చారు. తన కుమార్తె పట్ల తప్పుడుగా మాట్లాడడం పట్ల ఆమె తీవ్రంగా స్పందించారు. ఈ రకంగా మాట్లాడినందుకు సిగ్గుపడాలన్నారు. లేకపోతే నీకు రాముడే భవిష్యత్తులో తగిన గుణపాఠం నేర్పుతాడని ఆమె అభిప్రాయపడ్డారు. నీ కూతురిని నా వద్దకు పంపు నేను రనీ కూతురిని రేప్ చేస్తా అంటూ అతను ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు ప్రియాంక ఘాటుగా స్పందించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

View image on Twitter

English Title
Congress' Priyanka Chaturvedi Threatened In Tweet, Files Complaint

MORE FROM AUTHOR

RELATED ARTICLES