ఢిల్లీ చేరిన కాంగ్రెస్ రాజకీయం.. ప్రారంభమైన నేతల లాబీయింగ్

ఢిల్లీ చేరిన కాంగ్రెస్ రాజకీయం.. ప్రారంభమైన నేతల లాబీయింగ్
x
Highlights

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో రాజకీయం నువ్వా, నేనా అనే రీతిలో సాగింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు అధికార బిజెపికి ముచ్చెమటలు పట్టిస్తూ...

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో రాజకీయం నువ్వా, నేనా అనే రీతిలో సాగింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు అధికార బిజెపికి ముచ్చెమటలు పట్టిస్తూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు పూర్తిగా నిరాశ పరిచాయి. రాజస్థాన్ లో కాంగ్రెస్ గాలి వీస్తోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అదే విషయం తెలియ చేశాయి. ఇక సీఎం పదవి కోసం ఇటు అశోక్ గెహ్లాట్ ఇటు సచిన్ పైలట్ హోరాహోరిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పడికే పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంతనాలు జరిపేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. టైమ్స్ నౌ సర్వే ప్రకారం 200 సీట్లున్న రాజస్థాన్ అసెంబ్లీలోఎన్నికలు జరిగినవి199స్థానాలు వీటిలో బిజెపికి 85 , కాంగ్రెస్ కు 105, బీఎస్పీకి రెండు, ఇతరులకు రెండు సీట్లు వచ్చే అవకాశముంది. ఇండియాటుడే టీమ్ రాజస్థాన్ అంతా విస్తృతంగా పర్యటించి 63వేలమంది ఓటర్లను సర్వే చేసింది. ఈ ఎగ్జిట్ పోల్ సర్వే కాంగ్రెస్ కు ఏకంగా 119 నుంచి 141 స్థానాలు వచ్చే ఆస్కారముందంది. బిజెపికి కేవలం 55 నుంచి 72 సీట్లు వస్తాయని, ఇతరులకు 4నుంచి 11 సీట్లు వస్తాయని అంచనా కట్టింది. కాంగ్రెస్ కూటమిదే గెలుపని బీజేపీ అధికారం కోల్పోనుందని తేల్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories