కాంగ్రెస్ పార్టీపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..

Submitted by chandram on Tue, 11/20/2018 - 15:50
cong

వచ్చేనెలలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. ఇందులో భాగంగానే ఈనెల 23న కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాకకోసం పెద్ద ఎత్తున్న కాంగ్రెస్ నేతలు సన్నహాలు చేస్తున్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగానే సోనియాకు ఆ‍‍హ్వానం పలుకుతూ ఫ్లెక్సీ కట్టారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఈ విషయంపై విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో ఒక్కమహిళ ఫోటో కూడా లేకపోవడంతో విజయశాంతి విరుచుకపడ్డారు. ఒక్క మహిళా మంత్రి కూడా లేదంటూ టీఆర్‌ఎస్‌ని విమర్శించే మనం ఇప్పుడు చేసింది ఏంటంటూ ప్రశ్నించారు?. ఈ సభలో మగవాళ్లు మాత్రమే ఉంటారా? మహిళలు కూడా సభకు హాజరవుతారు కదా అంటూ విజయశాంతి ఒక ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. సోంతపార్టీపై విజయశాంతి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్యర్యానికి గురిచేసింది.

English Title
Congress Party Star Campaigner Vijayashanthi Fire on congress party

MORE FROM AUTHOR

RELATED ARTICLES