గద్వాల జేజమ్మకు చెక్ పెట్టడానికి రాజకీయ వ్యూహాం

x
Highlights

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గద్వాల జేజేమ్మ నాగం జాయినింగ్ ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..? ఆయన పార్టీలోకి రావడం వల్ల వచ్చే నష్టమేంటి..? ఆమె స్థానానికి...

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గద్వాల జేజేమ్మ నాగం జాయినింగ్ ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..? ఆయన పార్టీలోకి రావడం వల్ల వచ్చే నష్టమేంటి..? ఆమె స్థానానికి ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారా..? డికే అరుణ కోపమంతా జైపాల్ రెడ్డి పైనా.. నాగంపైనా..? ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ లో ఇదే చర్చ జరుగుతోంది.

తెలంగాణ కాంగ్రేస్ లో డికే అరుణ పార్టీ సీనియర్ నాయకురాలు. జిల్లా రాజకీయాల్లో ఆమెకు ప్రత్యేక స్థానముంది. కేంద్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న మాజి కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలపై దృష్టిపెట్టాలని భావిస్తున్నారు. అందులో బాగంగా తన జిల్లాల్లో ఆదిపత్యం కోసం గద్వాల జేజమ్మకు చెక్ పెట్టడానికి రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. తన అనుంగ శిశ్యుడు నాగం జనార్దన్ రెడ్డిని సైతం కాంగ్రేస్ గూటికి తీసుకురావడానికి పాచిక వేయడంతో ఢికే సైతం ధీటుగా తిప్పికొట్టేందుకు సిద్దమవుతోంది.

జైపాల్ రెడ్డి వ్యూహాత్మకంగానే డికే అరుణ ప్రభావం తగ్గించేందుకు జిల్లాల్లో పార్టీ ముఖ్యనేతలను ఒక్కొక్కరిని ఆమెకు దూరం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సైతం జైపాల్ గ్రూపులో చేరిన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో డీకే అరుణ మద్దతు తీసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంధర్ రెడ్డి ప్రస్తుతం జైపాల్ వర్గంలో చేరినట్లు తెలుస్తోంది. రేవంత్ తన మనిషే కావడంతో ఇక నాగం లాంటి సీనియర్ ను పార్టీకి తీసుకు వచ్చి డికే అరుణాకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ నాగర్ కర్నూల్ నేత దామోదర్ రెడ్డి సైతం డికే అరుణకు మద్దతుగా నిలుస్తున్నారు. నాగం వల్ల పార్టీకి నష్టం తప్పా లాభంలేదిని మండిపడుతున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణలో వీక్ గా ఉండడంతో కాంగ్రేస్ ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేస్తోంది. అందులో బాగంగానే నాగం జనార్దన్ రెడ్డిని చేర్చుకుంటున్నారని తెలుస్తోంది. అదే ఇప్పుడు జైపాల్ రెడ్డికి అస్త్రంగా మారింది. ఆయన చేస్తున్న చేరికలపై జిల్లా రాజకీయాల్లలో డికే అరుణ లాంటి నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినా జైపాల్ రెడ్డి మాత్రం బీజేపి నేతలు అని చెప్పి, డికే వర్గాన్ని సైలెంటు చేసే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. కాంగ్రేస్ పాలమూరు నేతలు చేస్తున్న రాజకీయాలు రాష్ట్ర కాంగ్రేస్ ను కూడా వణికిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories