మహాకూటమి పొత్తులపై ఎమ్మెల్సీ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 11/09/2018 - 15:25

మహాకూటమి పొత్తులపై ఎమ్మెల్సీ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాకూటమిలో ఇప్పటి వరకు సీట్ల కేటాయింపులు మాత్రమే పూర్తయ్యాయని ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఇంకా నిర్ణయించలేదన్నారు. కూటమిలోని అన్ని పార్టీలు పొత్తు ధర్మాన్ని పాటించాల్సి ఉందన్న ఆయన ఎవరూ చెప్పక ముందే ఖమ్మంలో టీడీపీ నేత నామా నాగేశ్వరరావు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. టికెట్ల కేటాయింపులో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్న పొంగులేటి ప్యారాచ్యుట్‌ నేతలకు అవకాశం ఇచ్చే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలన్నారు. ఖమ్మం జిల్లాలో పార్టీ పరిస్ధితిని వివరించేందుకు వార్ రూం సమావేశానికి హాజరువుతున్నట్టు తెలిపారు.    

English Title
Congress MLC Ponguleti Sudhakar Reddy Sensational Comments On Mahakutami Alliances

MORE FROM AUTHOR

RELATED ARTICLES