స్పీకర్‌, రేవంత్‌రెడ్డి మధ్య వాగ్వాదం

Submitted by arun on Mon, 06/11/2018 - 14:16
congmlas

సీఎల్పీ లీడర్‌ జానారెడ్డి నేతృత్వంలో స్పీకర్‌ మధుసూదనాచారితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాలు పునరుద్ధరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు వినతి చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యే రేవంత రెడ్డి కి మధ్య వాగ్వాదం జరిగింది.. కోర్టు తీర్పు ఎందుకు అమలు చేయడం లేదని స్పీకర్ ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.. ‘పెన్ను దొంగలిస్తేనే ఉరిశిక్ష వేసినట్లు’గా మీ వైఖరి ఉందంటూ స్పీకర్‌ను గట్టిగా నిలదీశారు. రేవంత్‌ వ్యాఖ్యలతో చిన్నబుచ్చుకున్న స్పీకర్‌.. మీరు ఇలా మాట్లాడితే వెళ్లిపోతానని అన్నారు. దీంతో సీఎల్పీ నేత జానారెడ్డి రేవంత్‌రెడ్డిని వారించారు.

English Title
Congress MLAs Membership Restoration | CLP Leaders Request to Speaker

MORE FROM AUTHOR

RELATED ARTICLES