ఎమ్మెల్యే చెంపచెల్లుమనిపించిన లేడీ కానిస్టేబుల్‌ (వీడియో)

x
Highlights

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో పర్యటిస్తున్నారు. రాష్ట్ర పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించేందుకు రాహుల్...

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో పర్యటిస్తున్నారు. రాష్ట్ర పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించేందుకు రాహుల్ అక్కడకు వెళ్లారు. అయితే ఆ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ఎమ్మెల్యే ఆశా కుమారికి చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళ కానిస్టేబుల్‌ తో దురుసుగా ప్రవర్తించబోయి.. చెంప దెబ్బ తిన్నారు. ఎమ్మెల్యే ఆశా కుమారి కార్యాయలం దగ్గరకు చేరుకున్నారు. అయితే పోలీస్‌ సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఆమె వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఓ మహిళా కానిస్టేబుల్‌ చెంప పగలకొట్టారు. అయితే దానికి ప్రతిగా ఆ కానిస్టేబుల్‌ కూడా ఆమె చెంప వాయించింది. వివాదం ముదరడంతో అక్కడే ఉన్న వారు ఆ ఇద్దర్నీ నిలువరించే ప్రయత్నం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories