కాంగ్రెస్‌లో సీట్లు అమ్ముకుంటున్నారంటూ అసంతృప్తుల ఆరోపణలు

కాంగ్రెస్‌లో సీట్లు అమ్ముకుంటున్నారంటూ అసంతృప్తుల ఆరోపణలు
x
Highlights

అభ్యర్థుల ఖరారుపై తంటాలు పడుతున్న కాంగ్రెస్ కు మరో సమస్య వచ్చిపడింది. కొందరు పార్టీ పెద్దలు టికెట్లు అమ్ముకుంటున్నారని స్వయంగా ఆ పార్టీ నేతలే...

అభ్యర్థుల ఖరారుపై తంటాలు పడుతున్న కాంగ్రెస్ కు మరో సమస్య వచ్చిపడింది. కొందరు పార్టీ పెద్దలు టికెట్లు అమ్ముకుంటున్నారని స్వయంగా ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఒక్కో టికెట్ కోట్లాది రూపాయలకు అమ్ముడుపోతుందని చెబుతున్నారు. ఇందుకు సాక్ష్యంగా రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ ఆడియే టేపు ను విడుదల చేశారు. టికెట్ల వ్యవహారం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారితే, ఇప్పుడు టికెట్లు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ పెద్దలు కోట్లాది రూపాయలకు టికెట్లు అమ్ముకుంటున్నారని రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. సాక్ష్యంగా ఆడియో టేపును విడుదల చేశారు. ఇబ్రహీంపట్నం టికెట్ కోసం క్యామ మల్లేష్ ప్రయాత్నం చేశారు. కాంగ్రెస్ టికెట్ల కోసం స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్ ఒక్కో నియోజకవర్గం నుంచి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తన కుమారుడు అంజన్‌తో పాటు మరొక సన్నిహితుడిని భక్తచరణ్ దాస్ కుమారుడు సాగర్ వద్దకు పంపితే.. రూ. 3 కోట్లు ఇస్తే సీటు కన్ఫామ్ చేస్తామని సాగర్ చెప్పినట్లు క్యామ మల్లేష్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఆడియోను క్యామ మల్లేష్ విడుదల చేశారు.

రాజేంద్ర నగర్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. మహాకూటమి పొత్తులో భాగంగా రాజేంద్రనగర్ సీటును టీడీపీ తీసుకుని ఆ పార్టీ తెలంగాణ శాఖ ఎల్. రమణ టికెట్ అమ్ముకున్నారని ఆరోపించారు. రాజేంద్రనగర్ లో టికెట్ విషయంలో పార్టీ పెద్దలు పునరాలోచన చేయాలని కార్తీక్ రెడ్డి కోరారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు దానం నాగేందర్‌తో కుమ్మకై 10 కోట్లు తీసుకొని ఆయనపై బలహీత నేత దాసోజు శ్రవణ్‌ను నిలబెట్టారని క్యామ మల్లేష్ ఆరోపించారు. కాంగ్రెస్‌ బీసీలకు అన్యాయం చేసిందన్నారు. ఇబ్రహీపట్నం కాంగ్రెస్‌ కార్యకర్తలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.

మరోవైపు కార్తీక్ రెడ్డి రాజీనామాకు మద్దతుగా స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేశారు. శంషాబాద్ కాంగ్రెస్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కార్తీక్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భక్తచరణ్ దాస్ కుమారుడు సాగర్ క్యామ మల్లేశ్ కుమారుడికి డబ్బులు అడుగుతున్నట్లుగా ఉన్న ఆడియో టేపులు వెలుగుచూడటంతో కాంగ్రెస్ పెద్దలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories