కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి...జానారెడ్డి ఎదుటే కార్యకర్తల వాగ్వాదం

Submitted by arun on Sat, 11/03/2018 - 16:34

కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి మొదలైంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో  నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి సమక్షంలోనే కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి రచ్చ చేశారు. మిర్యాలగూడ స్థానాన్ని పొత్తుల పేరిట మరో పార్టీకి కట్టబెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి కాకుండా మొదటి నుండి పార్టీ జెండా మోసిన వారికి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. టీఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన అమరేందర్ రెడ్డి వర్గం ఓ వైపు శంకర్ నాయక్,  స్కైలాబ్ నాయక్ వర్గీయులు మరోవైపు తమ నేతకు టికెట్ ఇవ్వాలని జానారెడ్డి ఎదుటే వాగ్వాదానికి దిగారు. దీంతో జానారెడ్డితో పాటు ఇతర నేతలు జోక్యం చేసుకుని  అందరి అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం చేద్దామని కార్యకర్తలను శాంతింపజేశారు.

English Title
Congress leaders fight Over Miryalaguda Seat

MORE FROM AUTHOR

RELATED ARTICLES