కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు...అయనకు టికెట్ ఇవ్వకపోతే నేనూ పోటీ చేయను...

Submitted by arun on Fri, 11/09/2018 - 11:33
kvr

కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకపోతే తాను కూడా నల్గొండ నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. కార్యకర్తల మనోభీష్టానికి వ్యతిరేకంగా పార్టీ నడుచుకుంటే ఎంతటి వారినైనా ఓడిస్తారని హెచ్చరించారు. ఇవాళ నార్కట్‌పల్లి వచ్చిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యకర్తల ఆందోళనపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నకిరేకల్‌ టికెట్ చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకుంటే నల్గొండలో తాను పోటీ చేయనని తేల్చి చెప్పారు.  పొత్తుల పేరుతో నకిరేకల్‌ను వేరొకరికి ఇస్తే చూస్తూ ఉరుకోబోమన్నారు. జరగబోయే పరిణామాలకు ఉత్తమ్‌, జానారెడ్డి బాధ్యత వహించాలని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. 

English Title
congress leader komatireddy fire on uttam kumar reddy

MORE FROM AUTHOR

RELATED ARTICLES