కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి బెయిల్ మంజూరు

Submitted by arun on Mon, 09/24/2018 - 13:53
jg

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు.. మానవ అక్రమ రవాణాలో ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయిన జగ్గారెడ్డికి ఊరట లభించింది. ఆయనకు సికింద్రాబాద్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో చంచల్‌ గూడ జైల్లో ఉన్న ఆయన ఇవాళ సాయంత్రానికి విడుదలయ్యే అవకాశం ఉంది. తన భార్య పిల్లల పేర్లపై తప్పుడు పాస్‌పోర్టు ద్వారా అమెరికాకు గుజరాతీలను తీసుకెళ్లారంటూ ఆయనపై ప్రధాన ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆయన్ని కస్టడీకి తీసుకున్న పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. 

English Title
congress leader jagga reddy got bail

MORE FROM AUTHOR

RELATED ARTICLES