టీఆర్ఎస్‌కు భారీ షాక్ ఇవ్వనున్న కాంగ్రెస్?

Submitted by arun on Mon, 10/15/2018 - 16:46
rk

టీఆర్ఎస్‌కు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. అధికార పార్టీ నుంచి కీలక నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు హస్తం నేతలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ కు చెందిన పలువురు సీనియర్లు.. కారు దిగి, కాంగ్రెస్ గూటికి చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల రాహుల్ పర్యటన సందర్భంగా.. టీఆర్ఎస్‌లోని పలువురు నేతలను, కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

రంగారెడ్డి జిల్లా నుంచి సిట్టింగ్ ఎంపీతో పాటు.. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కీలక నేతలను, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మాజీ మంత్రి ని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ పీసీసీ కాంగ్రెస్ లో చేరుతున్నట్టు తెలుస్తోంది. పీసీసీ నేతలు మంగళవారం ఢిల్లీకి వెళ్లి, రాహుల్ తో చర్చించి.. వీరి జాయినింగ్స్ పై క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. 

Tags
English Title
congress give big shock to trs

MORE FROM AUTHOR

RELATED ARTICLES