కాంగ్రెస్‌ ఫస్ట్‌ లిస్ట్‌ రెడీ.. అభ్యర్థులు వీరే!!

కాంగ్రెస్‌ ఫస్ట్‌ లిస్ట్‌ రెడీ.. అభ్యర్థులు వీరే!!
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్... ఎన్నికల ప్రచారంలో దూకడానికి సన్నదం అవుతోంది. కనీసం అభ్యర్దులను ప్రకటించకుండా ప్రచారం చేయడం సాధ్యం కాదని భావిస్తున్న హస్తం పార్టీ...

తెలంగాణ కాంగ్రెస్... ఎన్నికల ప్రచారంలో దూకడానికి సన్నదం అవుతోంది. కనీసం అభ్యర్దులను ప్రకటించకుండా ప్రచారం చేయడం సాధ్యం కాదని భావిస్తున్న హస్తం పార్టీ మొదటి లిస్టు విడుదలకు సన్నాహాలు చేస్తుంది. రానున్న రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉండడంతో అభ్యర్థుల మొదటి లిస్టు రిలీజ్‌కు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమిలో ఇబ్బందిలేని స్థానాలపై మొదటి లిస్టు అభ్యర్ధులు పేర్లు ఉండేలా ప్లాన్ చేస్తోంది. సిట్టింగ్ స్థానాలను కాంగ్రెస్ మొదటి లిస్టులో చేర్చడానికి సిద్దమయినట్లు తెలుస్తోంది. అందుకు సీనియర్లు.. సిట్టింగ్‌లతో మొదటి లిస్టు దాదాపు 40 పేర్లతో విడుదల చేయడానికి అధిష్టానం వద్ద గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదటి లిస్టుపై చర్చించేందుకు కోర్ కమిటీ భేటీ కాబోతుంది. కోర్ కమిటీలో కూటమిలో భాగస్వామ్య పక్షాలకు అభ్యంతరం లేని స్థానాలను మొదటి లిస్టులో చేర్చాలని భావిస్తోంది. మహా కూటమి చర్చల్లో మొదటి లిస్టులో ప్రకటించే స్థానాలపై కాంగ్రెస్ పార్టీ చర్చించినట్లు తెలుస్తోంది.

ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ మొదటి జాబితాను ప్రకటించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి విడతలో 35 నుంచి 40 సీట్ల వరకు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రకటించాలనుకుంటున్న సీట్లు గురించి గాంధీభవన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 1. మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి -స‌న‌త్‌న‌గ‌ర్. 2. జీవ‌న్‌రెడ్డి -జ‌గిత్యాల‌. 3. శ్రీధ‌ర్‌బాబు -మంథ‌ని. 4. ఎ.లక్ష్మణ్‌కుమార్ -ధ‌ర్మపురి. 5. ఆరెప‌ల్లి మోహ‌న్ -మాన‌కొండూరు. 6. భ‌ట్టి విక్రమార్క -మ‌థిర‌. 7. రేవంత్‌రెడ్డి -కొడంగ‌ల్. 8.చిన్నారెడ్డి -వ‌న‌ప‌ర్తి. 9. డి.కె అరుణ‌-గ‌ద్వాల‌. 10. సంప‌త్‌కుమార్- అలంపూర్. 11. వంశీచంద‌ర్‌రెడ్డి -క‌ల్వకుర్తి. 12. రామ్మోహ‌న్‌రెడ్డి -ప‌రిగి. 13. స‌బితఇంద్రారెడ్డి -మ‌హేశ్వరం. 14. ప్రతాప్‌రెడ్డి -షాద్‌న‌గ‌ర్. 15.మ‌హేశ్వర్‌రెడ్డి -నిర్మల్. 16. దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ -ఆంథోల్. 17. సునితా ల‌క్ష్మారెడ్డి -నర్సాపూర్. 18. గీతారెడ్డి -జ‌హీరాబాద్. 19. జ‌గ్గారెడ్డి -సంగారెడ్డి. 20. ప్రతాప్‌రెడ్డి -గ‌జ్వేల్. 21. కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి -న‌ల్గొండ‌. 22. దామోద‌ర్‌రెడ్డి -సూర్యాపేట్. 23. జానారెడ్డి-నాగార్జునసాగ‌ర్. 24. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -హుజూర్‌న‌గ‌ర్. 25. ప‌ద్మావ‌తి -కోదాడ‌. 26. భిక్షమ‌య్యగౌడ్ -ఆలేర్. 27. సుద‌ర్శన్‌రెడ్డి -బోధ‌న్. 28. ష‌బ్బీర్‌అలీ -కామారెడ్డి. 29. అనిల్ -బాల్కొండ‌. 30. పొన్నాల ల‌క్ష్మయ్య -జ‌న‌గాం. 31. గడ్డం ప్రసాద్- వికారాబాద్. 32. దొంతి మాధ‌వ‌రెడ్డి -న‌ర్సంపేట. 33. గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి -భూపాల‌ప‌ల్లి. 34. సీత‌క్క -ములుగు. . 35. మల్‌రెడ్డి రంగారెడ్డి- ఇబ్రహీంపట్నం. 36. ఎల్.బి.నగర్- సుధీర్‌రెడ్డి. 37. ఆది శ్రీనివాస్- వేములవాడ. 38. నాగం జనార్దన్‌రెడ్డి- నాగర్‌కర్నూల్. 39. విష్ణువర్ధన్‌రెడ్డి- జూబ్లీహిల్స్. ఇలా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవడం కోసం అభ్యర్దులో ప్రకటన తప్పనిసరి కావడంతో అత్యసవరంగా మొదటి లిస్టు ప్రకటనకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. మొదటి లిస్టు ప్రకటనతో రెండో లిస్టు విడుదలకు పార్టీలో వత్తిడి పెరిగే అవకాశముంది. పార్టీలో ఎలాంటి వత్తిడి రాకముందే.... కూటమి సర్దుబాట్లు పూర్తి చేసుకొని మొత్తం అభ్యర్దులను ప్రకటన చేయాలని పార్టీ భావిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories