ముంబై కోర్టుకు రాహుల్ గాంధీ....

Submitted by arun on Tue, 06/12/2018 - 11:14
Rahul Gandhi

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ ముంబై సమీపంలోని భివండి కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. ఆరెస్సెస్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో విచారణ ఎదుర్కొంటున్న రాహుల్... మహారాష్ట్రలో రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ ఉదయమే ముంబై చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో భివండి కోర్టుకు హాజరుకానున్నారు. మహాత్మాగాంధీ హత్య వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడంతో... ఆరెస్సెస్ కార్యకర్త రాజేశ్ కుంతే 2014లో ఆయనపై పరువునష్టం కేసు వేశారు. ఈ కేసులో రాహుల్ వాగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలంటూ మే 2న కోర్టు ఆదేశించింది. 


 

English Title
Congress chief Rahul Gandhi will appear before a Bhiwandi court

MORE FROM AUTHOR

RELATED ARTICLES