కాంగ్రెస్, బీజేపీ కొత్త టార్గెట్.. హరీష్ రావు!

Submitted by arun on Mon, 03/12/2018 - 11:50
Harish Rao

ఎవరు ఒప్పుకున్నా.. ఎవరు ఒప్పుకోకున్నా.. ఇది మాత్రం కచ్చితంగా నిజం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కానీ.. ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ ను కానీ.. రాజకీయంగా ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. టీఆర్ఎస్ లో కూడా.. ఇద్దరి ఆధిపత్యం బాగా నడుస్తోంది. ఢిల్లీ పర్యటనలు కావొచ్చు.. అంతర్జాతీయ స్థాయి సమావేశాలు కావొచ్చు.. కేసీఆర్ అడుగుజాడల్లో కేటీఆర్ ముద్ర పడేలా.. కసరత్తు జరుగుతున్న మాట వాస్తవం.

ఇలాంటి సమయంలో.. జనం దృష్టిని మరల్చేందుకే.. కాంగ్రెస్, బీజేపీలు కొత్త ఎత్తుగడ పన్నినట్టు విశ్లేషకులు అనుమానిస్తున్నారు. హరీష్ బీజేపీలో చేరతారని కొందరు ప్రచారం చేసుకుంటుంటే.. టీఆర్ఎస్ లో హరీష్ ప్రాధాన్యతపై కాంగ్రెస్ నేతలు మాటల దాడికి దిగుతున్నారు. తాను పార్టీ మారడం లేదని.. స్వయానా హరీష్ రావు చెప్పుకోవాల్సి రావడానికి కారణం ఏంటని.. రేవంత్ రెడ్డి లాంటి కాంగ్రెస్ నేతలు నిలదీశారు. టీఆర్ఎస్ లో కేటీఆర్ ప్రథమ శ్రేణి నేత ఐతే హరీష్ ద్వితీయ శ్రేణి నాయకుడిగా మారిపోయారని అన్నారు.

దీంతో.. అటు బీజేపీ కానీ.. ఇటు కాంగ్రెస్ కానీ.. అధికారంలోకి వచ్చేందుకు హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి కుటుంబాన్ని.. అందునా హరీష్ ను టార్గెట్ చేస్తే.. రాజకీయంగా తమకు ఏదో ఒక సందర్భంలో లాభం కలగకపోతుందా అని ఆ పార్టీలు ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఇది… ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది.. ఆసక్తికరంగా మారింది.

English Title
Congress & BJP Target on TRS Minister Harish Rao

MORE FROM AUTHOR

RELATED ARTICLES