బండ్ల గణేశ్‌కు కీలక పదవి!

Submitted by arun on Mon, 11/19/2018 - 14:01
bandla ganesh

పవన్‌ కల్యాణ్‌ వీరాభిమానిగా చెప్పుకునే సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. పలు టీవీ చానళ్లలో హడావుడి చేస్తూ ఈ సారి ఎన్నికల్లో పోటీచేస్తున్నానని, రాజేంద్ర నగర్‌ టికెట్‌ తనదేనని ధీమా వ్యక్తం చేశారు. హస్తం పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఆశించిన బండ్ల గణేష్‌కు ఆ పార్టీ మొండిచెయ్యి చూపింది. రాజేంద్రనగర్ సీటు ఆశించిన బండ్ల గణేష్‌కు మహా కూటమి రూపంలో నిరాశ ఎదురైంది. పొత్తులో భాగంగా రాజేంద్ర నగర్ టికెట్ టీడీపీ అభ్యర్థి గణేష్ గుప్తాకు దక్కింది. రాజేంద్రనగర్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టింది కాంగ్రెస్‌ పార్టీ. ఇందులో భాగంగా బండ్ల గణేష్‌ను టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

English Title
congress appoints bandlagensh has spokesperson

MORE FROM AUTHOR

RELATED ARTICLES