ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీ కాంగ్రెస్ స్కెచ్

x
Highlights

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ బహుముఖ వ్యూహాలు రచిస్తోంది. ఓ వైపు ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఎన్నికల మేనిఫెస్టో తయారీలో...

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ బహుముఖ వ్యూహాలు రచిస్తోంది. ఓ వైపు ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఎన్నికల మేనిఫెస్టో తయారీలో పడినట్టు తెలుస్తోంది. అధికార TRS విస్మరించిన సంక్షేమ పథకాలను చేర్చి ప్రజలను ఆకట్టుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా పెన్షన్స్, హౌసింగ్ స్కీంల సాధ్యాసాధ్యాలు, అమలు రూట్ మ్యాప్ కోసం అడ్వైజరి కమిటీని నియమించింది.

వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ స్కెచ్ రెడీ చేసుకుంటుంది. ఇప్పటికే రైతు రుణమాఫీ, పండిన పంటకు మద్దతు ధర, నిరుద్యోగ భృతి లాంటి పథకాలను ప్రజల ముందుంచిన హస్తం పార్టీ.. ఇప్పుడు పెన్షన్, హౌసింగ్ స్కీంలపై దృష్టి సారించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, సిఎల్పీ డిప్యూటీ లీడర్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో 42 మందితో కూడిన అడ్వైజరి కమిటిని వేసింది.

ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న అన్ని పెన్షన్లను రెట్టింపు ఇవ్వాలని కమిటీలో నిర్ణయించిన్నట్లు సమాచారం. ఇక కేసీఆర్ సర్కార్ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడంలో విఫలమైందని, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించలేదని... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడానికి శ్యాచురేషన్ పద్దతిలో 5 లక్షలు, తమకు నచ్చినట్లు కట్టుకునే వారికీ 2 లక్షలు ఇందిరమ్మ బిల్లులు చెల్లించి.. ఇంకో రూమ్ కి కావాల్సిన డబ్బులు ఇవ్వాలని కమిటీలో నిర్ణయించినట్లు తెలుస్తుంది.

హౌసింగ్, పెన్షన్ స్కీమ్ ల పై ఏప్రిల్ మొదటివారంలో జీవన్ రెడ్డి అడ్వైజరీ కమిటి నివేదిక ఇవ్వనుంది. తాము అధికారానికి వస్తే సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేస్తామని ప్రజల్లో నమ్మకం కల్గించి కారు జోరుకు బ్రేక్ వేయాలని డిసైడ్ అయింది హస్తం పార్టీ...!

Show Full Article
Print Article
Next Story
More Stories