ఒక్కో ఆట‌గాడికి రోజుకు 34 కండోమ్స్ పంపిణీ

ఒక్కో ఆట‌గాడికి రోజుకు 34 కండోమ్స్ పంపిణీ
x
Highlights

కామన్వెల్త్ గేమ్స్‌ కోసం అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గోల్డ్ కోస్ట్ వేదికగా కామన్‌వెల్త్ గేమ్స్-2018 బుధవారం (ఏప్రిల్ 4)...


కామన్వెల్త్ గేమ్స్‌ కోసం అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గోల్డ్ కోస్ట్ వేదికగా కామన్‌వెల్త్ గేమ్స్-2018 బుధవారం (ఏప్రిల్ 4) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వేలాది మంది క్రీడాకారులు, అధికారులు, లక్షలాది మంది అభిమానులు గోల్డ్ కోస్ట్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఆరోగ్య రక్షణ కోసం వారికి లక్షల సంఖ్యలో కండోమ్స్ అందుబాటులో ఉంచారు.

కామన్వెల్త్ గేమ్స్ 11 రోజులపాటు జరుగనున్నాయి. ఈ 11 రోజుల కోసం దాదాపు 2.25 లక్షల కండోములు, 17000 టాయిలెట్ రోల్స్‌ అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా అందరికీ ఉచితంగా ఐస్‌క్రీమ్స్ అందిచనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఒక్కో అథ్లెట్‌కు 34 కండోమ్స్ పంపిణీ చేయనున్నారు. ఈ పోటీల్లో సుమారు 6,600 మంది అథ్లెట్లు పాల్గొంటున్నట్టు సమాచారం. అంటే ఒక్కో అథ్లెట్ రోజుకి 3 కండోమ్స్ వినియోగించుకొవచ్చన్నమాట. రియో ఒలింపిక్స్‌లో అథ్లెట్లకి అత్యధికంగా 4.50 లక్షల కండోమ్స్ పంపిణీ చేశారు. ఆ సమయంలో జికా వ్యాధి ప్రబలంగా ఉండటంతో.. ఎవరికీ ఎలాంటి హాని జరుగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కామన్‌వెల్త్ విలేజ్‌లో ఆటగాళ్ల ఆహ్లాదం కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. స్విమ్మింగ్ పూల్స్, మానవ నిర్మిత జలపాలాలతో కూడిన ప్రత్యేక లాంజ్‌లు, 24 గంటలు నడిచే డైనింగ్ రూమ్‌లు అందుబాటులోకి తెచ్చారు. అథ్లెట్ల కోసం శాఖహారం, మాంసాహార వంటకాలు అందుబాటులోఉంటాయి. అంతేకాకుండా అథ్లెట్లు బసచేయడానికి 1,250 అపార్ట్‌మెంట్లు, టౌన్ హౌస్‌లు నిర్మించారు. ఆటలు ముగిసిన తర్వాత కామన్‌వెల్త్ విలేజ్‌ని అమ్మకానికి లేదా అద్దెకు ఇవ్వనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories