హన్మంతరావు నటించిన చిత్రాలు...

Submitted by arun on Mon, 02/19/2018 - 12:41
Gundu Hanumantha Rao

తెలుగు సినీ పరిశ్రమ.. మరో కమెడియన్ ను కోల్పోయింది. ప్రముఖ హాస్యనటుడు.. గుండు హనుమంతారావు.. ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో.. కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 

సుమారు 400 లకు పైగా సినిమాల్లో నటించిన గుండు హనుమంతారావు.. తనదైన ప్రత్యేకమైన హాస్యంతో పరిశ్రమలో పేరు సంపాదించాడు. సినిమాల్లోకి రాకముందు మిఠాయిల వ్యాపారం చేసే హనుమంతారావుకు.. నాటకాలంటే ఎక్కువగా ఇష్టపడేవారు. ఒకసారి మద్రాస్ లో ఆయన వేసిన నాటకాన్ని చూసిన జంధ్యాల.. అహ నా పెళ్లంట సినిమాలో మొదటిసారిగా వేషం ఇచ్చారు. అప్పటి నుంచి సినిమాల్లో ఆయనకు అవకాశాలు వచ్చి పడ్డాయి.  అనంతరం వరసగా సినిమా అవకాశాలు రావడంతో 50 సినిమాలు నటించిన తరువాత తన నివాసం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మార్చారు. ఆయన భార్య ఝాన్సీరాణి(45) 2010లో మృతి చెందారు. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ తాను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ తన అనారోగ్య విషయాన్ని ఎవరికీ తెలియజేయలేదన్నారు. దీంతో విషయం తెలుసుకున్న చిరంజీవి ఆయనకు ఆర్థిక సాయం అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.4లక్షల ఆర్థిక సహాయం అందజేసింది. హనుమంతరావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. 

హన్మంతరావు నటించిన చిత్రాలు:... 
చిన్నబాబు (1988)
హై హై నాయకా (1989)
ప్రేమ (1989)
కొబ్బరి బొండాం (1991)
బాబాయి హోటల్ (1992)
అల్లరి అల్లుడు (1993)
వద్దు బావా తప్పు (1993)
మాయలోడు (1993)
పేకాట పాపారావు (1993)
ప్రేమ చిత్రం పెళ్ళి విచిత్రం (1993)
నంబర్ వన్ (1994)
శుభలగ్నం (1994)
యమలీల (1994)
వజ్రం (1995)
క్రిమినల్ (1995)
ఘటోత్కచుడు (1995)
రిక్షావోడు (1995)
వినోదం (1996)
మావిచిగురు (1996)
జగదేకవీరుడు (1996)
అన్నమయ్య (1997)
లవ్ స్టోరీ 1999 (1998)
యమజాతకుడు (1999)
సమరసింహారెడ్డి (1999)
కలిసుందాం రా (2000)
ఫ్యామిలీ సర్కస్ (2001)
భలేవాడివి బాసూ (2001)
మృగరాజు (2001)
తప్పు చేసి పప్పు కూడు (2002)
నువ్వు లేక నేను లేను (2002)
ఆయుధం (2003)
సత్యం (2003)
పెళ్ళాం ఊరెళితే (2003)
రక్షక్ (2004)
గౌతమ్ SSC (2005)
ధన 51 (2005)
అతడు (2005)
భద్ర (2005)
శ్రీ కృష్ణ 2006 (2006)
మాయాజాలం (2006)
ఆట (2007)
ఎవడైతే నాకేంటి (2007) - 
పాండురంగడు (2008)
నగరం (2008)
కృష్ణార్జున (2008)
పెళ్ళికాని ప్రసాద్ (2008)
వాన (2008)
దీపావళి (208)
మస్కా (2009)
రాజ్ (2010)
ఆలస్యం అమృతం (2010)
పప్పు (2010)


 

English Title
comedian gundu hanumantha rao movies

MORE FROM AUTHOR

RELATED ARTICLES