వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి కొత్త రూల్

x
Highlights

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి పేరెంట్స్‌కు కొత్త రూల్ తీసుకొచ్చారు. కొందరు దానిని సమర్ధిస్తే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ కలెక్టర్...

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి పేరెంట్స్‌కు కొత్త రూల్ తీసుకొచ్చారు. కొందరు దానిని సమర్ధిస్తే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ కలెక్టర్ తీసుకొచ్చిన రూలేంటి.?

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు.. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి కొత్త రూల్ తీసుకొచ్చారు. పేరెంట్స్ ప్రతి నెలా స్కూల్ టీచర్లు, ప్రిన్సిపాల్‌ను తప్పనిసరిగా కలవాలన్నారు. ఎవరైతే 2 నెలలు ప్రిన్సిపాల్‌ను, ఉపాధ్యాయులను కలవకుండా ఉంటారో.. వాళ్లకు రేషన్, పించన్‌లో కోత విధిస్తామన్నారు. విద్యార్థులకు కూడా ఆమ్రపాలి కొన్ని సూచనలు చేశారు. పాఠ్యపుస్తకాలతో పాటు గ్రంథాలయాల్లోని ఇతర పుస్తకాలనూ కూడా చదవడం అలవాటు చేసుకోవాలన్నారు.

న్యూశాయంపేట ప్రభుత్వ పాఠశాలలో.. ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి కలెక్టర్ ఆమ్రపాలి బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆమ్రపాలి, వినయ్‌భాస్కర్‌ అక్షరాభ్యాసం చేయించి పుస్తకాలు, దుస్తులను పంపిణీ చేశారు. బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని చెప్పారు ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌.

వరుసగా 2 నెలలు ప్రిన్సిపాల్‌ను, టీచర్లను కలవకపోతే.. రేషన్, పించన్‌లో కోత విధిస్తామనడంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు.. కలెక్టర్ ఆమ్రపాలి నిర్ణయానికి మద్దతిస్తుండగా.. మరికొందరు ఇది కరెక్ట్ కాదంటున్నారు. ఇదిలా ఉంటే.. 2 వారాల్లో జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులందరికీ ఓ పరీక్ష పెడతామన్నారు కలెక్టర్ ఆమ్రపాలి. ఆ పరీక్ష ఫలితం ద్వారా ఏ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నారో చూసి గుర్తిస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories