కొత్త ఫ్రంట్‌పై సీఎం కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు

Submitted by arun on Tue, 04/17/2018 - 16:10
kcr

కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా 2019 ఎన్నికల నాటికి కొత్త కూటమి ఏర్పాటు చేయాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నిన్నటి వరకు బీజేపీ మిత్రపక్షంగా ఉండి ఇప్పుడు ఉప్పు నిప్పులా మారిన బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌తో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. అయితే ఒడిసాలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున వచ్చే నెల మొదటివారంలో భేటి కానున్నారు. ఈ సందర్భంగా  తాజా రాజకీయ పరిణామాలతో పాటు 2019 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించే అవకాశముంది. 

English Title
cm kcr will meet odisha cm naveen patnaik

MORE FROM AUTHOR

RELATED ARTICLES